పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/28

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మైసూర్‌ పులి టిపూ సుల్తాన్‌

ప్రవర్తించిన వారి పట్ల నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించారు. సరిహద్దు ప్రాంతాలలో గల తన ప్రజలను ఇబ్బందుల పాల్జేసిన శక్తులను తన శతృవులుగా ప్రకటిచారు, ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ప్రజలకు ఎవరు శత్రువులో వారు తనకూ శత్రువులని అన్నారు. ఈ మేరకు టిపూ ప్రకటిచిన అధికారిక ప్రవర్తన నియామావళి ఆయన ఉన్నత ఉద్దేశాలను వివరిస్తుంది. నా ప్రజలతో ఎవరు కలహిస్తారో, వారు నాతో యుద్ధం ప్రకటిచినట్టు, అనిటిపూ తన శత్రువులను, సంఘ వ్యతిరేక శక్తులను చాలా తీవ్రంగాహెచ్చరించారు.

     (“ To quarrel with our subjects is to go to war with ourselves.

They are our shield and our buckler; and it is they who furnish us with all things. Reserve the hostile strength of our empire exclusively for its foreign enemies. - AURUNGZEB AND TIPU SULTAN, Evolution of their Religious Polices, BN Pandey, Page. 22) సమాజంలోని బలహీన వర్గాల పట్ల అయన ప్రత్యేక శ్రద్దను కనపర్చారు. పిల్లలు, మహిళలు, వృద్ధుల సంక్షేమం కోసం నిర్దుష్ట చర్యలుతీసుకున్నారు.అనాధలు,ఆడపిల్లలను ఆలయాలలో దేవదాసీలుగా స్వీకరించటం, విదేశాలకు సేవకులుగా విక్రయించటం తగదాన్నారు. ఆనాధాలైన బాలికల క్రయవిక్రయాలు శిక్షార్హమైన తీవ్రనేరాలుగా ప్రకటించారు. అనాధలుస్వయం పోషకులయ్యేందుకు తగిన శిక్షణ, ఆరువాత ఉపాధి అవకాశాలు కల్పించారు. శిల్షణ పూర్తయ్యేంత వరకు మాత్రం ప్రభుత్వం పోషణ బాధ్యాతను స్వీకరిస్తుందని, ఈ మేరకు టిపూ చర్యలు చేపట్టారు.

వికలాంగులకు, అంధులకు ఆత్మస్థయిర్యం కలుగ చేసేందుకు పలురకాల సహయక చర్యలు అమలుచేశారు. ఈ అభాగ్యులు తమ స్వంత కాళ్ళమీద తామునిలబడేందుకు అవసరమగు అన్ని చర్య లను తీసుకోవాలని ఆయన అధికారులకు ఆజ్ఞలుజారీ చేయ టం మాత్రమే కాకుండ, ఆయా బలహీన వర్గాలకు చెందిన పదకాల అమలును కూడ ఆయన స్వయంగా పర్యవేక్షించారు. యుద్ధ రంగంలో చనిపోయిన సైనికుల కుటుంబాల పట్ల ఆయన శ్రద్ధ చూపారు. భర్తలను కోల్పోయిన భార్యలు, వారి పిల్లల పోషణ పట్ల ప్రత్యేక బాధ్యత వహించారు.యుద్ధం వలన వ్యకిగత జీవితాలకు జరిగిన నష్టాల భర్తీకి ఆయన చర్య లు తీసుకున్నారు.

యుద్ధం కారణంగా అన్యాయంగా ఎవ్వరికీ ఎటువంటి నష్టం కలుగరాదాని ఆయన ఆదేశాలు జారీ చేశారు. రాజ్యసేవలో ప్యూన్‌ స్థాయి చిన్న ఉద్యోగులు మరణిస్తేఆ ఉద్యోగి వారసునికి

25