పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టిపూ రాజముద్ర

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

            ఆధునిక సూత్రాల కనుగుణంగా పాలన

(పాక్‌ - పశ్చిమ దేశాల సామాజిక, సాంకేతిక పరిజ్ఞానాన్నిసంతరించుకున్న టిపూ సంప్రదాయక ప్రభుత్వపాలనకు భిన్నంగా, ప్రజలకు ఉత్తమ సేవలను అందచేసేఆధునిక పద్ధతులను ప్రవేశ పెట్టిన తొలిస్వదేశీ పాలకుడిగా ఖ్యాతి గడించారు. ప్రభుత్వ యంత్రాగాన్నిపలు మార్పులకు గురిచేసారు. ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ప్రబుత్వం పనిచేయాలని వాంఛించిన టిపూ, పాలకుడిగా నిరంతరం ప్రజల శ్రేయస్సును ఆకాంక్షిస్తూ ఆ దిశగా పనిచేసారు. ఈ విధానాల వల్లనే టిపూను ప్రజలు అమితంగా ప్రేమించారు.టిపూ ఎదాుర్కొన్న కష్టకాలంలో ఆయనకు తోడు నిలిచారు.

1792లో జరిగిన మైసూరు యుద్ధలో యుద్ధ నష్ట పరిహారం కింద మూడున్నర

కోట్ల రూపాయలను ప్రత్యర్థులకు టిపూ చెల్లించాల్సి వచ్చింది. ఆ సమయాన ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉంది. మంత్రుల సలహా మేరకు టిపూ ప్రజల సహకారాన్ని అర్థించగా,ప్రజలు అమితోత్సాహంతో ముందుకు వచ్చిన తమ వాటాగా మూడున్నర కోట్ల స్థానంలో పది కోట్ల రూపాయలను సమకూర్చారు. ఈ అనుకూల ప్రతిస్పందన బట్టి ప్రజలు  టిపూను ఎంతగా ప్రేమించారన్న విషయంతోపాటు ప్రజలు ఎంతి ఉన్నత ప్రమాణాలతో జీవితాలను గడిపారో గ్రహించవచ్చు.

టిపూపాలన ఆశ్చర్యంగా అత్యంత ఆధునిక సూత్రాలకు అనుగుణంగా సాగిందంటూ ప్రముఖ ఆంగ్లేయ చరిత్రకారుడు పి. ఫెర్నాండజ్‌ తన గ్రంధం 'Storm over Srirangapatnam' లో బహువిధాల ప్రశంసించాడు. ఆయన సంక్షేమ రాజ్యం బలమెన కేద్ర ప్రబుత్వం, పలు ప్రాంతాల సమంవయ సమర్ధపాలన, చక్కని న్యాయపాలనా

12