పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మైసూర్‌ పులి టిపూ సుల్తాన్‌

             పారిశ్రామిక రంగంలో అగ్రగామి

ప్రజల సంక్షేమంలో తన సంతోషం ఉందని నమ్మిన ప్రభువు కావటంతో ప్రజల ప్రగతికి అవసరమైన ఆన్ని రంగాల మీదా ఆయన దాృష్టి సారించారు. ఆయా రంగాలలో అభివృద్ధిని సాధించేందుకు, ఆయా రంగాలలో నూతన పోకడలను,పరిజ్ఞానాన్ని ప్రవేశ పెట్టేందుకు టిపూ ఎంతగానో శ్రమించారు.

టిపూ వర్తక వాణిజ్యాభివృద్ధితో పాటు విదేశాలలో కర్మాగారాలను స్థాపిం చేందుకు కృషి సల్పారు. ఈ విషయ మై చక్క ని దౌత్యం నడిపి విదేశీ నేతలను అంగీకరింపచేశారు. ఆ దేశాల సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వదేశానికి రాబట్టటంలో ఆయన విజయం సాధించారు.

ఈ మేరకు స్వదేశంలో పరిశ్రమల స్థాపనకు పలుచర్యలు తీసుకున్నారు. ఔత్సాహికులకు ఆయన ప్రోత్సాహకాలు ప్రకటిచారు. పారిశ్రామిక రంగం పట్ల, పారిశ్రామిక ఉత్పత్తుల పట్ల ప్రత్యేక ఆసక్తి చూపారు. ఈ రంగం అభివృద్ధికి ఆయన నిపుణులైన విదేశీ కార్మికులను రప్పించి ప్రజలకు శిక్షణ ఇప్పించారు. శ్రీరంగపట్నం,చిత్రదుర్గ, బెంగళారు, బెద్నూర్‌లలో కర్మాగారాలను ఏర్పాటు చేయించారు. ఈకర్మాగారాలలో యుద్ధ సామగ్రితోపాటుగా, గృహోపకరణాలు, కత్తులు, వాచీలు లాింటివి కూడ తయారు చేయించారు.

ఉత్పత్తిదారుడు, వినియోగదారుని మధ్య దళారులను వీలయినంతగా తొలగించ ప్రయత్నించారు. ఈ చర్యల వలన అటు ఉత్పత్తిదారులు, చేతి వృత్తుల కళాకారులు,కార్మికులకు ఇటు వినియోగదారులకు ఎంతో మేలు జరిగింది. ఆ కారణంగా అటువ్యవసాయరంగం, ఇటు పారిశ్రామిక రంగం బాగా అభివృద్ధిచెందాయి.

ఏది చేసనా, ఏది చేయించినా ఆన్నివిషయాలు తన దృష్టిని దాిటిపోనివ్వకుండా చూసుకోవటం ఆయన ప్రత్యేకత కావటంతో ప్రతిరంగం సమర్ధవంతంగా రూపొందింది. టిపూ ప్రారిశామ్రిక రంగం పట్ల చూపిన ప్రత్యేక ఆసక్తిని గమనించిన ఆంగ్లేయాధికారి P. Fernandes “... no other sovereign in Indian history had given such impetus to industrial production.”అని అన్నాడు. ( TIPU SULTAN THE GREAT : Glimpses of His Work and Personality , essay By Mufthi Shamshuddin Ahemed, published RADIANCE Views Weekly, 1-7 Aug.1999, Page. 35) 19