పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/21

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

అంటే ప్రత్యేక అభిమానం అంటూ ఏమీ లేని ఈ ఆంగ్లేయ చరిత్రకారుడు అంతటితో సరిపెట్టుకోలేదు. ఆ కాలంలో ఆంగ్లేయుల, వారి వత్తాసుదారుల పాలన క్రింద ఉన్న కర్నాటక, ఔద్‌ రాజ్యాలు అత్యంత వేగంగా ఎడరులుగా మారనున్నాయంటూ, కూడ పేర్కొనటం విశేషం.

('...there were good crops in Tipus regime and his subjects were happier than all others in India... the best cultivated and its population the most flourishing in India. while under English and their dependencies, the population of the Carnatic and Oudh, hasting to the state of deserts, were the most wretched upon the face of the earth ' - TIPU SULTAN : HIS VISION AND MISSION, By Prof. B. Sheik Ali, Published in Radiance Views Weekly 1-7 August 1999, Page. 13 ) టిపూ వ్యవసాయ రంగం, ఆ రంగానికి అనుబంధంగా ఉన్నరంగాలకు అత్యధిక ప్రాధాన్యత నిచ్చి తగిన చర్యలను పటిష్టంగా అమలు పర్చినందున మైసూరు రాజ్యం పలు యుద్ధాలను ఎదాుర్కొన్నప్పికి పాడి పంటలతో కళకళలాడింది. మైసూరు రాజ్యమంతా పచ్చదనం పూర్తిగా పర్చుకుంది.

అపరిచిత ప్రాంతంలో ఓ ప్రయాణికుడు ప్రయాణిస్తున్నప్పుడు, పచ్చని పొలాలు, శ్రమజీవులు, నూతనంగా నిర్మాణమైన నగరాలు, అభివృద్ధి చెందుతున్న వర్తక- వ్యాపారాలు, పెరుగుతున్న పట్టణాల సంఖ్య ఎక్కడైతే కన్పిస్తాయో, ఎక్కడైతే ప్రతిదీ సంతోషదాయకంగా దార్శనమిస్తుందో, ఆ ప్రాంతం ప్రజల అభిమతాలకు అనుగుణమైన ప్రభుత్వ పాలన క్రింద ఉందాని నిర్ధారించుకోవచ్చు. అటువంటిరాజ్యం టిపూ రాజ్యం.అంటూ ప్రఖ్యాత అంగ్లేయ చరిత్రకారుడు Edward Moore 1794 అభిప్రాయపడ్డాడరు. ఈ అభిప్రాయం అతని రాతల్లో ఈవిధంగా ఉంది‘ ..When a person traveling through strange country finds it well cultivated populous with industrious inhabitants, cities newly founded, commerce extending,towns increasing and every thing flourishing so as to indicate happiness, he will naturally conclude it to be under form of Government congenial to the minds of people. This is a picture of Tipus’s country, and our conclusion respecting its Government. ( BN Pandy Page.16.)

టిపూ ఆంగ్లేయులను ఈ గడ్డ నుండి తరిమి వేయాలని సంకల్పించి పోరాడు తుండగా, ఆంగ్ల చరిత్రకారులు ఆయన పాలన-పద్దతుల గురించి చేసిన వ్యాఖ్యానాలు,అభిప్రాయలు గమనిస్తే టిపూ పాలన ఎంత జనరంజకంగా ఉందో, రాజ్యం మరెంత పచ్చగా ఉందో, ప్రజలు ఎంతటి సుఖశాంతులతో గడిపారో మనకు అర్థం అవుతుంది. 18 11