పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మైసూర్‌ పులి టిపూ సుల్తాన్‌

వ్యవస్థకు అన్వయించారు. సముద్ర తీరం సరిహద్దులుగా గల ప్రాంతాల నుండి నావికాదాళం ఏర్పాటుతో రాజ్య రక్షణకు నడుంకట్టాలని టిపూ ఆలోచించారు. ఈ దిశగా కూడ ఆయన తగిన చర్యలు చేప్టారు. యుద్దరంగంలో కూడ నౌకలను వినియోగించేందుకు అవసరమైన శికణ కోసం ఆయన ప్రత్యే కంగా కళాశాలను ఏర్పాటు చేశారు. 1793లో ప్రసిద్ద వ్యాపార కేంద్రమైన భట్కల్ వద్ద ఆయన Naval College ప్రారంభించారు. ఎగుమతుల- దిగుమతుల వ్యాపారా నికి ఆయన ఎంతటి ప్రాముఖ్యతనిచ్చారో, అంతే ప్రాముఖ్యత రాజ్యరలక్షణకు ఇచ్చారు. యుద్ధ్దరంగంలో నావికాదాళం నిర్వహించే ప్రత్యేక ప్రాధాన్యత దృష్త్యా యుద్ధ నౌకల నిర్మాణం, సైన్యానికి శిక్షణ కోసం ఆయన పటిష్టమై ఏర్పాట్లు చేశారు. (Eminent Muslim Freedom Fighters, G. Allana,Low Price Publications, Delhi, 1993, Page. 75)

                వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత

టిపూ వ్యవసాయ రంగాన్ని ఎంతగానో ప్రోత్సహించారు. నీిటి పారుదల సౌకర్యం కల్పించేందుకు అధిక శ్రద్ధ చూపించారు. పన్ను విధింపు పద్దతిలో మార్పులు చేశారు. పన్ను అనేది భూమి విస్తీర్ణం మీద ఆధారపడి కాకుండ, ఉత్పత్తి మీద ఆధారపడి నిర్ణయించారు. అంతే కాదు వర్షం నీిటి ఆధార భూములు, నీిటి పారుదాల ఆధారిత భూములకు వేర్వేరుగా విభజించారు. పంట సిరులు అందించే రైతుకు భూమి మీద హక్కు కల్పించారు. జాగీర్దారి జులుంకు చరమగీతం పాడారు. బంజరు భూములను మాగాణులుగా మార్చే రైతులు, మూడు సంవత్సరాల పాటు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదని పన్ను రాయితీలు కల్పించారు. పన్నుల వసూలుకు మధ్య దాళారీలను తొలగించి ప్రభుత్వ ఉద్యోగులను నియమించారు. వ్యవసాయ పనిముట్ల కొనుగోలు కోసం రైతులకు రుణ స్ధకర్యం కల్పించారు. నీిటి పారుదల కోసం పలు చర్య లు చేపట్టారు. నాడు కావేరి నది మీద ఎక్కడయితే నీిపారుదలకు ప్రాజెక్టుట్టాలని టిపూ ఉద్దేశించారో, అక్కడే ఈనాడు కృష్ణరాయసాగర్‌ నిర్మాణం కావటం విశేషం.

టిపూ జనరంజక పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో జీవించారు. ఈ విషయాన్నిప్రముఖ చరిత్రకారుడు జేమ్స్‌ మిల్‌ తన History of British India భారతదేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలందరి కంటే టిపూ రాజ్యంలోని ప్రజలు సంతోషంగా ఉన్నారు. పంటలు బాగా పండాయి అని పేర్కొన్నాడు. టిపూ సుల్తాన్‌ 17