పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/19

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

అభివృద్ధిపర్చారు. పలు ప్రాంతాలనుండి చేతి వృత్తి కళాకారులను, నిపుణులను మెసూరు రాజ్యానికి రప్పించి తన ప్రజలకు, శ్రామికులకు ప్రత్యేక శిక∆ణ ఇప్పించారు.అన్నివర్గాల ప్రజల అభివృద్ది కోసం పలు నూతన పథకాలను ఆవిష్కరించి ఆ పథకాలు సమర్ధవంతంగా అమలు జరిగేలా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. నూతన తరహా సహకార బ్యాంకులను ఏర్పాటు చేసారు. సంపన్న వర్గాల పెత్తనం తగ్గించేందుకు ఎక్కువ మొత్తాలను బ్యాంకులలో వాటాలుగా పొదుపు చేసినవారికి లాభాలలో వాటాను తగ్గించారు. పేద వర్గాలను పొదుపు వైపునకు ఆకర్షించేందుకు తక్కువ మొత్తాలను లాభాలుగా ప్రకటించారు. ప్రజలలో పొదుపును, మదుపును ప్రోత్సహించారు.

వర్తక-వాణిజ్య రంగాన్ని తీర్చిదిద్దారు. తూనికలు-కొలతల వ్యవస్థను ఆధునీకరించారు. ప్రజలు మోసాలకు గురికాకుండ తగిన కట్టుదిట్టమైన చర్యలను తీసుకున్నారు. వరక, వాణిజ్య పారిశ్రామిక రంగాలలో ప్రబుత్వ పాత్రను అధికం చేసారు.వర్తక-వాణిజ్య రంగాలలో ప్రభుత్వ పాత్రను అధికం చేసేందుకు టిపూ సుల్తాన్‌ ఆనాడే ప్రబుత్వంద్వారా వ్యాపారాన్ని నిర్వహింప చేశారు. ఈ మేరకు ప్రబుత్వ వ్యాపార సంస్థను (State Trading Corporation) ఏర్పాటు చేశారు.

టిపూ విదేశీ వ్యాపారం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. స్వదేశ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయ డాన్ని ప్రోత్సహించటమే కాకుండ, ఎగుమతులను సులభతరం చేసేందాుకు ఆయన నౌకా వ్యాపారం కోసం నౌకా స్థావరాన్నినిర్మించారు. ఈ విధగా వ్యాపారాభివృద్ధి లలక్ష్యగా వ్యాపార నౌకల నిర్మాణం చేపట్టిన ప్రదమ పాలకునిగా ఖ్యాతిగాంచారు.

(Tipu was the first ruler to build merchant navy - Prof.Shaik Ali in his essay Tipu's Development projects and Administrative Machinery, published in Radiance 1-7,Aug 1999, page 28)

1793 లో వంద నౌకల నిర్మాణానికి సంకల్పించారు. ఈ మేరకు నిర్మాణమైన రెండు నౌకలకు 'KHIZRI' మరియు ' HYAS ' అని ఆయన స్యయంగా నామకరణం చేశారు. ఈ నౌకల నిర్మాణానికి అవసరమైన ముడిపదార్దాలను svaదేశంలోసమకూర్చుకుంటూ, సాంకేతిక పరిజ్ఞానాన్నివిదేశాల నుండి స్వీకరించారు. ఈ నౌకలనిర్మాణాలకు ప్రసిద్దిగాంచిన వివిధ దేశాలలోని ఆయా వ్యవస్థల సమాచారం తెప్పించుకుని అధ్యయనం చేసి ప్రతి వ్యవస్థలోని ప్రగతిశీల అంశాన్ని గ్రహించి దానిని స్వదేశీ 16 10