పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/15

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకుల పెత్తనాన్ని సవాల్‌ చేసి, ఈ గడ్డ మీద నిలదొక్కుకుంటున్న బ్రిీటిషర్లను తొడగోట్టి సవాల్‌ చేసిన టిపూ సుల్తాన్‌ 1750 నవంబర్‌ 10వ తేదీన కర్ణాటక రాష్ట్రంలోని కోలార్‌ జిల్లా దేవనహళ్ళి గ్రామంలో జన్మించారు. అసమాన ధైర్యసాహసాలతో దాకి∆ణ భారత దేశపు నెపోలియన్‌గా ఖ్యాతిగాంచిన, అరివీర భయంకరుడు. మైసూరు పాలకుడు హైదార్‌ అలీ, శ్రీమతి ఫాతిమా ఫక్రున్నీసాలు టిపూ తల్లిదండ్రులు. ఆర్కాట్ కుచెందిన ప్రముఖ సూఫి తత్వవేత్త మస్తాన్ నెలియా అనుగ్రహం వలన తమకు కలిగాడని భావించిన తల్లితండ్రులు, ఆయనను స్మరించుకుంటూ టిపూ అని ముద్దుగా పిలుచుకున్నారు.టిపూ తాతయ్య పేరు ఫతే ముహమ్మద్‌. ఆయన జ్ఞాపకార్థం,అయన మీద ఉన్నగౌరవం కొద్ది టిపూకు ఫతే అలీ అని పేరు పెట్టారు.

విద్యాగంధం లేని హైదర్‌, తన బిడ్డ మాత్రం పండితుడు, యుద్ద విద్యలలో ప్రవీణుడు కావాలని సంకల్పించి, టిపూకు మంచి విద్యాబుద్దులు చెప్పించారు. తండ్రి ప్రత్యే క పర్య వేక్షణలో యుద్ధ కళను టిపూ ఔపోసన పట్టారు. ఆనాటి ప్రముఖ యోధులలో అగ్రగామిగా గుర్తింపు పొందారు. చిన్నతనం నుండి తండ్రి నాయకత్వంలో సాగిన పలు యుద్ధాలలో పాల్గొన్నారు. ఏ ఆంశానికి సంబంధించినదైనా, ఎటువంటి విశిష్ట,సాంకేతిక సమాచారమైనా అధ్యయనం చేసిన ఆకళింపు చేసుకోవటం నూతనత్వాన్ని అను నిత్యం ఆహ్వానించటం టిపూ ప్రత్యేకత. భారతీయ, పాశ్చాత్య తత్వవేత్తల,రాజనీతిజ్ఞుల గ్రంథాలను సేకరించి అధ్యయనం చేశారు. ఈ విధంగా సేకరించిన అపూర్వగ్రంథాల అధ్యాయనం ద్వారా సంపాదించుకున్న పరిజ్ఞానం, సాంఫిుక, ఆర్థ్దిక,రాజకీయ పరిణామాల మీద టిపూ సాధికారికంగా చేసినటువంటి విశ్లేషణలు, ఫ్రెంచ్‌,ఆంగ్లేయాధికారులను ఆశ్చర్యచకితులను చేసేవి. జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాల గురించి టిపూ వ్యకం చేసన అభిప్రాయాలు, దౌత్యవ్యూహాలను, బ్రిీటిష్‌ అధికారి డావ్‌టన్‌(Drbrypm) లాింటి ప్రముఖుడు ప్రత్యేకంగా ప్రశంసించక తప్పలేదు, 12 8