పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/14

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf

మైసూర్‌ పులి టిపూ సుల్తాన్‌

               మైసూరు పులి
               టిపూ సుల్తాన్‌


భారతదేశ రాజకీయ చరిత్రలో పద్దెనిమిదవ శతాబ్దపు ఉత్తరార్థ భాగం ఎంతో కీలకమైన సమయం. బెంగాల్‌ నవాబు సిరాజుద్దౌలాను పరాజితుడ్ని చేసి, బెంగాల్‌ దివానిని హస్తగతం చేసు కున్న ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులు, దక్షిణాదిని ఆక్రమించు కోవానికి యుకులు, కుయుకులు పనుflతునాflరు. ఈ సామ్రాజ్యవాద శక్తుల రాజ్యవిస్తరణ కాంక్షను అర్థం చేసుకోని స్వదేశీపాలకులు పరస్పరం కలహించుకుంటున్నారు. ఈసమయంలో నేనున్నా...నేనున్నాఅంటూ భారత రాజకీయ చిత్రపటం మీద ఉదాయించాడొక భానుడు. ఆ మొనగాడే, ప్రముఖ చరిత్రకారుడు జేమ్స్‌ మిల్‌ (James Mill) చే THE GREATEST PRICE OF THE EAST గా కీర్తించబడిన, దాక్షిణ భారత దేశచరిత్రలో మధ్యాహ్న మార్తాండుడిగా వెలుగొందిన, మైసూరు పులి గా ఖ్యాతిగాంచిన టిపూ సుల్తాన్‌. 11