పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/12

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మైసూర్‌ పులి టిప్పుసుల్తాన్‌

                              నా మాట

బ్రిీటిష్‌ వ్యతిరేక పోరాటాలలో ప్రధాన పాత్ర వహించి మైసూరు పులిగాప్రఖ్యాతిగాంచిన టిపూ సుల్తాన్‌ జీవిత విశేషాలను తెలుగు పాఠకులకు పరిచయం చేయాలన్న సంకల్పంతో మైసూరు పులి టిపూ సుల్తాన్‌ రాశాను. ఈ సమాచారం గీటురాయి వారపత్రికలో ధారావాహికంగా ప్రచు రితమైంది. ఈ సీరియల్‌ను చదివిన పాఠకులు పలువురు దీనికి పుస్తక రూపం కల్పించమన్నారు. ఆ పాఠకుల కోరిక మేరకు 2002లో మిత్రులు జనాబ్‌ హబీబుర్‌ రహ్మన్‌ (విజయవాడ) సహకారంతో ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ పుస్తకంగా వెలువరించింది. ఈ చిన్నపుస్తకాన్ని పెద్ద మనస్సుతో పాఠకులు ఆదారించారు. పత్రికలు చక్కని సమీక్షలతో ప్రజలకు పరిచయం చేశాయి. ఆనాడు తెలుగు జీవిత గాథాల్లో గొప్పగా వచ్చిన పుస్తకం అంటూ పండితుల ప్రశంసలందాుకున్న ఈ పుస్తకానికి పాఠకుల నుండి లభించిన మరింత ఆదరణ మూలంగా 2004 లో ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ పునర్ముద్రించింది.ఆ సమయంలో కర్ణాటక ప్రాంతంలో కొన్నిమతోన్మాద స్వార్థపరశక్తులుటిప్పు సుల్తాన్‌ గురించి అపప్రదలను ముమ్మరంగా ప్రచారం చేసు న్నందున, ప్రజలకు వాస్తవాలు తెలపాలన్నఉద్దేశ్యంతో ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ ఛైర్మన్‌, హాజీ షేక్‌ పీర్‌ అహమ్మద్‌, ఈ పుస్తకాన్ని కర్ణాటకలోని తెలుగు ప్రజలు నివసించే ప్రాంతాలకు పంపి, మిత్రులద్వారా ఉచితంగా పంపిణీ చేయించారు. మన రాష్రంలో కూడ చాలా వరకు ఉచితంగా పంపిణి జరిగింది. ప్రధానంగా రాయలసీమ ప్రాంత ప్రజలకు ఈ పుస్తకాన్ని అందించారు. ఆ తరువాత తెలుగు ఇస్లామిక్‌ పబ్లికేషన్స్‌ వారు మైసూరు పులి:టిప్పు సుల్తాన్‌ పుస్తకాన్నిసరికొత్తగా ప్రచురించ సంకల్పించారు. ఆ సంస్థ సంచాలకులు జనాబ్ అబ్బాదుల్లాగారు, అలనాటి పుస్తకాన్నిపూర్తిగా తిరగరాసి నూతన 9