పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

వివరిస్తూనే, పాలక వర్గాల చర్యలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారి పట్ల ప్రభువులు ఏవిధాంగా ప్రవర్తిస్తారో అందాుకు భిన్నంగా టిపూ సుల్తాన్‌ ఏమాత్రం ప్రవర్తించలేదని, ఆనాటి ఇతర ప్రభువుల్లాగే ప్రభుత్వ వ్యతిరేకుల పట్ల టిపూ కూడ కఠినంగా, క్రూరంగా వ్యవహరించాడని పేర్కొన్నారు. ఈ విధాంగా టిపూలోని అన్ని పార్శ్యాలను దృశ్యీకరిస్తూ, తద్వారా చారిత్రక వ్యక్తుల వ్యక్తిత్వాలను ఆవిష్కరణలో నిష్పాక్షికత, సమతుల్యం పాిటించటం, రచయిత నిజాయితీ ఈ గ్రంథంలో కన్పిస్తుంది. ఈ గ్రంథంలో కేవలం టిపూ సుల్తాన్‌కు సంబంధించిన విలువైన సమాచారాన్ని అందించటం మాత్రమే కాకుండ,టిపూకు సంబంధించిన అపూర్వమైన ఫొటోలను, చిత్రాలను కూడ రచయిత ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, సేకరించి పొందుపర్చారు.టిపూ నిర్మించిన మస్జిద్‌-ఎ-ఆలా,టిపూ అనునిత్యం సందర్శించే శ్రీరంగనాధాస్వామిఆలయం ఫొటోలు, టిపూ స్వదస్తూరి, మూడవ మైసూరు యుద్దం నష్టపరిహారం కోసం తన బిడ్డలను పూచీకత్తుగా ఆంగ్లేయులకు అప్పగిస్తున్న చిత్రం, ఆయన ఆరుగురు కుమారుల చిత్రాలు, నాల్గవ మైసూరు యుద్ధంలో ప్రాముఖ్యత సంతరించుకున్న శ్రీరంగపట్నం కోటలోని వాటర్‌ గేటు, యుద్ధరంగంలో టిపూ నేల కూలిన స్థలం, ఆయన స్మారక స్థూపం, శిధిలమైన టిపూ ప్రాసాదాం, హైదార్‌ అలీ-ిపూ సుల్తాన్‌ల సమాదుల ఫొటోలు, చిత్రాలు ఈ గ్రంథం విలువను మరింతగా పెంచాయి. ముస్లింలకు వ్యతిరేకంగా మతోన్మాదా-రాజకీయ శక్తులు ఈనాడు సాగిస్తున్న దుష్ప్రచారం వలన మన దేశంలోని విభిన్న సాంఫిుక జనసముదాయాల మధ్య ఏర్పడు తున్న మానసిక అఘాతం గోద్రా-గుజరాత్‌ లాిం భయంకర సంఘటనలకు ప్రజలను పురికొల్పుతున్నందున, ఆనాడు మాతృభూమి విముక్తి కోసం ముస్లిం జనసముదాయాలు సాగించిన అసమాన పోరాటాలను, ఆ పోరాటాలలో పాల్గొన్న యోధులను, ఆ తరువాత మాతృదేశం అభివృద్ధి పథంలో మున్ముందుకు సాగిన కృషిలో భాగస్వాములైన ముస్లిం ప్రముఖుల కృషిని అందరికి ఎరుకపర్చాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ దిశగా కృషి జరిగి తగినంత సాహిత్యం సామాన్య ప్రజలకు అందాుబాటులోకి వచ్చినట్టయితే ఆయా సాంఫిుక జనసముదాయాల పట్ల పెంచిపోషించబడుతున్న అపోహలు- అపార్థాలు దూరమవుతాయి. ఆ మంచి వాతావరణంలో ఒక సామాజిక జన సముదాయం పట్ల మరొక జనసముదాయంలో గౌరవభావం అంకురించి సామరస్య-సహిష్ణుత భావనలు మరింతగా పపుష్టమవుతాయని ఆకాంక్షిస్తూ, ఆ దిశగా తెలుగులో చరిత్ర రచనలను అందిస్తున్న రచయిత అభినందనీయులు.

                                    ,,,

8 6