పుట:మైసూరు పులి టిపూ సుల్తాన్.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మైసూర్‌ పులి టిపూ సుల్తాన్‌

విదేశీ పరిజ్ఞానాన్ని మేళవించి కొంగ్రొత్త విధానాల రూపశిల్పిగా, పరమత సహనంగల రాజుగా, పర్యావరణ పరిరక్షకుడిగా,న్యాయవ్యవస్థలో సరికొత్త శిక్షల విధానాన్నిప్రవేశ పిట్టిన సుల్తానుగా, రైతాంగం మిత్రుడిగా, నావికాదాళ వ్యవసకు వినూత్న హంగులు చేర్చిన దార్శినికుడిగా, యుద్ధ క్షిపణులు తయారి-వినియోగంలో ప్రథముడిగా, అన్నిటికి మించి మాతృభూమి రక్షణ కోసం వైరి వర్గాలను చెండాడుతూ యుద్ధరంగంలో కన్నుమూసిన ప్రపదమ స్వదేశీ యోధు డిగా టిపూ సుల్తాన్‌ వ్యకిత్వంలోని విభిన్న కోణాలను ఈ గ్రంథాం ఆవిష్కరించింది.

ఈ ఉన్నత-ఉత్తమ లక్షణాలన్నీటిపూ సుల్తాన్‌లో నిబిడీకృతమైయున్నాయన్న విషయాన్ని ధావీకరించేందుకు ప్రముఖ ఆంగ్లేయ రచయితలు స్వయంగా రాసిన పలుగ్రంథాల నుండి ఆధారాలను రచయిత సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ చూపారు. ఈ గ్రంథంలో పేర్కొన్న ప్రతి ప్రాధాన్యతగల అంశాన్ని నిరూపించేందుకు బ్రిీటిషు అధికారులు, స్వయంగా టిపూతో యుద్ధరంగంలో తలపడన అంగ్లేయ సైనికాధికారులు ఉటంకించిన వాక్యాలను రచయిత ఈ గ్రంథంలో పొందుపర్చుతూ, తాను రాసిన విషయాలకు బలం చేకూర్చారు. టిపూను పరాజితుడ్ని చేయ డానికి కంకణం కట్టుకున్న ఈస్ట్‌ ఇండియా కంపెనీ అధికారులు టిపూ విశిష్ట వ్యక్తిత్వం, ఆయన విధానాల మీదా చేసిన ప్రశంసనీయ వ్యాఖ్యలను ఆయన చక్కగా వినియోగించుకున్నారు. టిపూ సుల్తాన్‌ మీద ప్రచారంలో ఉన్న అతి ప్రధాన ఆరోపణలను ప్రస్తావిస్తూ, టిపూ చర్యలను మతోన్మాద స్వార్థపరశక్తులు ఏవిధంగా వక్రీకరించింది ఈ గ్రంథం తగినన్ని రుజువులతో స్పష్టపరిచింది. లౌకిక ప్రబుè వుగా ఖ్యాతి గడించిన టిపూను అపఖ్యాతి పాల్జేయడానికి, మూడు వేల బ్రాహ్మణుల ఆత్మహత్యకు ఆయన కారణమయ్యాడని కలకత్తా విశ్వవిద్యాలయం సంస్కృత విభాగాధిపతి డకర్‌ హరిప్రసాదా శాస్త్రి దురుద్దేశ్య పూర్వకంగా చేసిన అసత్య ఆరోపణలను వివరించి, ఆ ఆరోపణలను ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్‌ బి.యన్‌.పాండే ఏ విధగా బలమెన ఆధారాలతో శ్రీశాస్త్రి రాసిన ఆరోపణలను తిప్పికొిట్టిన తీరుతెన్నులను రచయిత విస్పష్టంగా పేర్కొన్నారు. జన జీవనంలో సభ్యత - నైతిక విలువల పరిరక్షణకు టిపూ చూపిన ఆసక్తి అందుకుగాను ఆయన చేపన సంస్కరణలు, ఆసంస్కరణల అమలుకు ఆయన తీసుకున్న చర్యలను కూడ వక్రీకరిస్తూ,టిపూ సుల్తానను పచ్చి మతోన్మాదిగా, క్రూరునిగా, నిరంకుశుడిగా దాశ్యీకరించేందుకు కొందరు విదేశీ-స్వదేశీ చరిత్రకారులు ఉద్దేశ్యపూరితంగా చేసిన ప్రయత్నాలను ఈ గ్రంధంలో విడమర్చి వివరిస్తూ, తగిన ఆధారాలతో ఆ ఆరోపణలను రచయిత తిప్పిగొట్టారు. టిపూను జనరంజక పాలకునిగా పేర్కొంటూ, ఆయనలోని సుగుణాలను 7