ప్రథమాశ్వాసము 47 సీ. వికచపుష్పాదమోమకరంధర సపాన మత్తాలిఝంక్రియామంజులంబు సంతతఫలరసాస్వాదసాదర వీర కులమృదులాలాప గుంభితంబు వరలతామందిరాంతర చరత్కిన్నరీ వీణాగుణక్వాణవిలసితంబు చారుమాధవలక్ష్మీ విహారభూమి యనఁగఁ గనుపట్టునిమ్మ హోద్యానవనము జగతి గోపాలదేవతాచక్రవర్తి చిత్త మెప్పుడు రంజిల్లఁ జేయుచుండు. అనుదినంబును రాజహంసాభిరామ మై యసురారినేత్రద్వయంబురీతి సంతతంబు రథాంగసాంగత్యశాలి యై పన్న గేశ్వరశాయిపాజికరణిఁ బ్రకటవిలాసవత్సదా ధివాస మై దర్పక గురుభుజాంతరముపోల్కి నాతతభువనపూర్ణామేయమూర్తి యై హరిత్రివిక్రమ మహోద్యమముపగితి భాసిలుచు నున్న దొర! గోపాలదేవు నలఘుకృపచేత నిర్మితం బయ్యె నగుచు సుజను లెన్నంగ ఘనయశఃస్ఫూర్తి నమ్మ హాతటాకంబు శాశ్వతం బగుచు నుండు. 208 204 వ. ఏవంవిధదిగంత శాంతకీర్తిసుగంధ విలసితమకరంధాభి రామరాజకుమారక ప్రసవసమగ్ర శ్రీ దంతులూరినం? పారిజాతమహీజాతంబునకుఁ బ్రకాండం బన వెలయుకొండమహీజాని కుమారత్రయంబునందు నగ్రజుం రాజచూడామణివంశం బివ్విధంబునం దామరతంప రై వర్ధిల్లుఁ దదను జుండు, నరామ 205
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/79
స్వరూపం