సీ.. 8. ఉ. ప్రథమాశ్వాసము యాచకలోక గోచరసురావనిజాతము జాతరూపమం థాచల తుల్యధైర్యమహిమాన్వితు బాపనృపాల శేఖరన్. హరినామమంత్రనంస్మరణంబుచేత నే ప్రభుజిహ్వ యత్యంతపావనంబు సకలధర్మక్రియాసంకల్పయుక్తి నే నృపమౌళిహృదయంబు నిశ్చలంబ యాచక వ్రాతవా౦ఛార్థ దానమున నే రాజుహ స్తంబు విరాజతంబు భండనోద్దండారిఖండనంబున నే న రేశుఖడ్గంబు ప్రకాశితంబు కీర్తి వహియించె నతఁడు సద్వర్తనమున నాదిరాజన్యులను బోలి యవనియందు దంతులురి యప్పధారుణీధవునిపుత్ర రత్న మైనట్టిబాపధరావరుండు. కప్పు నుమామనోహరునికంఠము కప్పు ఫణీంద్రునేత్రము ల్గప్పు హిమాంశులోఁ గలకలంకము గప్పును వాణివేణియం గప్పు సుధాబ్ధి నీఁద్రుహరికాయము కప్పును డంతుబారి శ్రీ యప్పనృపాలుబాపవసుధాధిపచంద్రుని కీర్తిచంద్రికల్. ఆర్యవినుతుఁ డైసయాబాపభూజని యంగనావతంస మప్పలాంబ ధీరసుగుణవతి పతివ్రతాతిలకంబు వెలయు సుజను లెల్ల వినతి సేయ. ఐదువలక్షణంబుల ధరాత్మజ సంతతశాంతివర్తన మేదిని యన్నదానగుణనిశ్చలతామతి నన్న పూర్ణ కం జోదరురాణి భాగ్యవిభవోన్నతిచేతను సాధుగణ్య పు ణ్యోదయ యప్పలాంబ చెలువొందు సధీజనతావకంన మై 25 122 123 124 125 126
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/57
స్వరూపం