B. సీ. ప్రథమాశ్వాసము హస్తాంగుళీనఖరాగ్రంబు చాలదే దారుణీధార మంతయును బూన నెంత శౌర్యసమున్నతుఁ డెంత వాగ్మి యెంత వితరణగుణవంతుఁ చెంత దక్షుఁ డనుచు బుధు లెల్ల నుతి నేయ నవనిఁ బ్రబలె విపులధైర్యసువర్ణాద్రి వేంకటాద్రి. స్మరియింపఁ డన్యంబు జలధికన్యామనో వల్లభశ్రీపదద్వయముకన్నఁ జరియింపఁ డన్యంబు శాశ్వతధర్మసం స్థాపనానై వుణోద్యమముకన్న హరియింపఁ డన్యంబు వరుషభాషణయుత ప్రతిపక్ష రూక్ష దర్పంబుకన్న భరియింపఁ డన్యంబు ఫణికులోత్త మశిరః పరిధృతశేషభూ [ధరముకన్న] నతనిహరిభక్తి యతనిధర్మానురక్తి యతనిమజశ క్తి యతనిరాజ్యభరయు క్తి విన్నుతి సేయంగఁ దరమె భూజనుల కనఁగఁ బ్రౌడి వహియించె రామభూపాలమౌళి. మహిత సర్వజ్ఞధర్మము మున్ను భంజించి సభల నేఁ డది ప్రకాశంబు సేయ మును పుణ్యజనకోటులను బీడితులఁ జేసి నేఁడు వారలఁ గృపానిరతిఁ బ్రోవ మున్ను విశ్వామిత్రమోదంబుఁ గావించి క్షితిని నేఁ డది నివారితము సేయఁ జరణానమద్విభీషణయుక్తి మును గాంచి నేఁడు ప్రసన్నతానియతిఁ బూన 93 .19 92
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/51
స్వరూపం