4 దగ్రసోదరుల యానఁగూర్చి తెలివెను. ఆమెయు మిగుల సంతసించి, సప్తసంతా నముల నొనర్పవలసినదనీ యాదేశించెను. ఆమెయభీష్టప్రకారము బాపరాజు సప్త సంతానములు నేను నుపక్రమించి, వానిలోఁ దాటాక ప్రతిష్ఠారనమును, నారామస్థా వనమును నెఱవేర్చెను. పిదపఁదన మనోవాంఛిత మయిన యొకకావ్యమును విరచించి, తనకులడై పత మయిన శ్రీమదన గోపాలస్వామి కంకితము సేయువాఁ డె యిట్లాలోచించెను. గీ. తొల్లిటి పుణ్యపూరుషుల తోరపుఁగీర్తులు సత్కవీశ్వరుల్ సల్లలితంబు లౌకృతులజాతులఁ బల్కిరి తద్వివేకమున్ గల్లనరాదు గాని త్రిజగత్పతి యౌపరమాత్మ సత్కథల్ తెల్లము గాఁగఁగావ్యమునఁ దెల్పుట భద్రము మాకుఁ జూడఁగన్. (1-45) ఏమహాత్మునివలస బ్రహ్మేంద్రముఖులు జననమందిరి తత్కధా సరణిమాని యితరదుర్గాధ వచియించు టెంచిచూడ మరుమరీచికిఁ బరువెత్తుకరణి గాదె? (1-40) గీ. అనుచునిశ్చయించి యాదిమపూరుషు చరిత్రయతని త్రిగుణసంశ్రయమునఁ గీర్తితంబు లైన మూర్తులమహిమంబు నేవచింతు నధిక నిపుణరీతి. (1-47) ఇట్లుగా సంకల్పించి రచించిన ప్రబంధమే మూర్తిత్రయోపాఖ్యానము. సప్త సంతానముల ప్రతిష్ఠ దంతులూరి బాపరాజకవి స వసంతానములలోఁ ఖముఖము అగు దేవాల యోద్యానవన తటాక ప్రతిష్ఠలు గావించి, తనయిన దైవమయిన శ్రీమదనగోప్పా స్వామిని డనియింపఁ జేసినట్టు 'వంశావతారము' లోని యీక్రిందిపద్యముల వలనఁ డెలియవచ్చుచున్నది.
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/5
స్వరూపం