ప్రథమాశ్వాసము . గుణము లేప్రొద్దు సౌశీల గుంభితములు భావ మేప్రొద్దు దాక్షిణ్యబంధురంబు దంతులురి తిమ్మ ధారుణీధవవరేణ్యు నంగనామణి యగు జగ్గమాంబ కెపుడు. పంచచామరము : ఉ. సీ. పతివ్రతామహత్త్వలీల భవ్యశాంతవర్తనం బతిప్రియో క్తి బంధుపోషణానురక్తి యాచకా శ్రితాళిఁ బ్రోచుసత్కృపావిశేషమున్ వివేకమున్ సతీలలామ దంతులూరి జగ్గమాంబకే తగున్. ఆ తిమ్మప్రభు జగ్గమాంబ పరిలూ నామిత్రులన్ బుత్రులన్ భీతారాతశరణ్యులన్ గనియె శ్రీ పేరక్ష మానాథునిన్ నీతి ప్రాజ్ఞుని వేంకటప్రభుమణిన్ నిర్ణద్రవాక్పండిత వాతస్తుత్యుని లింగభూవరుని శ్రీరామక్షమానాథునిస్. వారలలోన నగ్రజుఁ దబారితపౌరుషశాలి వైదు ర్వారయశశ్శశాంక రుచివారతిరస్కరణైక పండిత స్ఫారనిజ ప్రతాపమయభాసువికాసితధారుణీ! ప్రజా వీరజుఁ డైన వేరధరణీవిభుఁ డొప్పె నుదారలేజుఁ డై. 3 కఠినాహితాకుంఠకంఠకోటరకుండి కాస రక్తాంబు వాచమించి నిర్జరారాతిసందర్భగర్భోపరి చర్మకౌపీనంబు సంగ్రహించి దర్పనర్పడ్వైరిధమనికానికురుంబ ధవళయజ్ఞోపవీతములు దాల్చి కుటిలరూక్ష విపక్షకోడికరోటికా రచితరుద్రాక్ష హారములు పూని 17 85 86 87 88
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/49
స్వరూపం