Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

16 &. A. మూర్తిత్రయోపాఖ్యానము జనలోకవినుతపావనచర్ముఁ డయ్యును ఘనపాలనోద్యు కిఁ దనరువాఁడు భావింప నారూఢపద్మాక్షుఁ డయ్యును శివగుణసంయుక్తి ( తెలఁగువాఁడు విజితబలారి యై వెలయుచుండియును గో త్రావన ప్రజ్ఞచే నలరువాఁడు ధన్యుఁ డవనీశ లోక మూర్ధన్యుఁ డతివ దాన్యుఁ డన్యనృపాలక జన్యవిజయ సైన్యుఁ డెన్నఁగఁ దగు లింగజనవరేణు - తనవమణి యైన తిమ్మభూధరవరుండు. అప్పుల కాని వేఱకపదార్థ మొసంగఁగ లేఁడు మేఘుఁ డే చొప్పున నైనఁ బత్రములు చూపక యియ్యదు కల్పకంబు వీ రొప్పనిదాత లంచు మది సూహ యొనర్చుచు నేర్పు మీఱఁ దా రెప్పుడు తిమ్మభూపతిమ హేంద్రుని వేఁడ దు రసంఘముల్. కనకగిరిధీరుఁ డాతిమ్మజనవిధండు పరిణయం బయ్యె వైభవస్ఫురణ మీఱ శౌరిపాదాబ్జయుగళ సంచారబంధ రాకృతిస్వాంత జగ్గపాఖ్యాకకాంత. సీ. హృదయ మేప్రొద్దు ప్రాణేశ్వరచరణాంబు జాతసంగతభృంగశాబకంబు కరము వేప్రొద్దును గమనీయషడ్రస కలితాన్నదానై కకౌశలములు మాట లేప్రొద్దు నుమాధుర్యమాధుర్య నిత్యసత్యాచారనిశ్చలములు చెయ్వ లేప్రొద్దు నాశ్రితదీననముదాయ పోషణలీలావిభూషణములు 82 88 84