Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3 ముగ్గురు కుమారులు కలిగిరి. వారిలో జీవవాఁ డయిన అచ్భుతరాజు శాఖకుఁ జెందినవాఁడు దంతులూరి బాపరాజు కవి. ఈదంతులూరి అచ్యుతరాజు యొక్క నాలుగవకుమారుఁడు దంతులూరి వేంకటరాజు. అతనికి కోసమాంబయను భార్య వలన పెదకృపరాజు, సింగరాజు, జగ్గరాజు, బావరాజు అని నలుగురు కుమారులు కలిగిరి. వారిలోఁ గడగొట్టుకుమారుఁ డయిన దంతులూరె బావరాజు మూర్తిత్రయో పాఖ్యాన మను నీప్రబంధమునకుఁగర్త. 'ఇవ్విధంబున సుత్తరోత్తరాభి వృద్ధి నలరు దంతులూరి వంశరత్నాకరంబు అనందగని రాజకుమారు అందంబ బహూకరింప నూరు సద్గుణంబులకు నాశ్రయం జైన వేంకటరాజ శిఖామణి కుమార తిలకంబులోన నవరయిండై ననేను' (1-287) అనుఓనుబట్టియితఁడు వేంకట రాజు కుమారులలోఁ గడగొట్టువాఁడని రూఢి యగుచున్నది. కావ్యరచనా ప్రశంస దంతులూరి బావరా జొకకావ్యమును రచింప సుకల్పించి యొకనాఁడు 'ఆప్తమహీజానినుత బుధకవీండ్రుల'తో నిషాలా పకథల దొరకొని యుండెను. నానాపురాణపుణ్య ప్రసంగములతో నొడకొంతకాలము జరగెను. అంత సభ జను లతో నొకప్రస్తావమురాఁగా బాపరాజు మహోత్సాహఢరము పూని వారితో నిట్లనెను. రాజులకు నేధర్మముచేతఁ గీర్తిసుకృతములు కలుగును? మదీయపూర్వులయిన ధర్మణాదులు దేనిచేధన్యతఁ గాంచిరి! ఆప్రకారమును వచింపుఁడు.' అందులకు సమాధానముగా వారు సప్తసంతాన ప్రశంసగావించి, యందుఁ గావ్యము యొక్క మహత్వమును దెలిపిరి. వారిచేఁ బ్రబోధితుఁడై బాపరాజు సప్తనంతాసములలోఁ గృతియ ప్రశ స్తమయినదని తెలిసి, యద్ధకృతి నొకదానిని వెలయింప ముని దలఁచి యుంకఁగా నొక్కనాఁడతని యు గసోదరులు కొలువు దీరియాతని రావించి యరనితో నిట్లపలికి3. 'గురు దేవతలకు సంతరము లేదని బుధులు తెలుపుదురు. కానీ, ప్రత్యక్ష నిజమూర్తులగుటచేత దైవతముకన్నను గురువులే యుత్తములు. ఆ గురువులలోఁ గూడ జననీజనకులు పూజృతములు, వారిలో జనని యుత్తమురాలు. ఆమెయసుజ్జ యిచ్చిన కార్యమును నెలవేర్చుము' అనిరి. అందులకు మిగుల సంతో షించి భావరాజు తనజననికడ కేఁగి, యామె పాదముల కభివాదన మాచరించి, తన.