Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

G మూర్తిత్రయోపాఖ్యానము 3. §. శాఖ లేర్పఱచె నేశ్లాఘనీయుండు వి ఖ్యాతిగా వేదభూజాతమునకుఁ బలికె నేధన్యుండు పరతత్త్వవిజ్ఞాన సాధనం బై నట్టిశాస్త్ర మెలమీ డెలివె నేశేముషీకలితుఁ డష్టాధిక దశపురాణములందు ధర్మ సరణి వచియించె నేమౌని వసుధ నైదవవేద మె రూఢి గను మహాభారతంబు సతనిఁ బ్రత్యక్ష నారాయణాంశ మైన ఘనుఁ బరాశరసూను నగణ్యపుణ్య కలితు సత్యవతీసతీగర్భకు క్తి జనితముక్తా యమాను నే సంస్తుతింతు. ఉపమచే విలసిల్లియు నుర్విలోన సనుపమము లై నయట్టికావ్యములు చెప్పి కీర్తిఁ గాంచినయాజగత్కీర్తనీయ చరితుఁ డగు కాళిదాసు నే సంస్తుతింతు. ఉ. వాణి నిజానసాంబుజనివాసమున న్నటియింప సత్కృతి శ్రేణు లొనరీ ధారుణిఁ బ్రసిద్ధి వహించిన ప్రౌఢవాణులన్ బాణమయూరచోర శివభద్రధనంజయమల్హ ణాది గీ ర్వాణవచఃప్రవీణకవివర్యుల నార్యులఁ బ్రస్తుతించెదన్. ఉ. నన్నయభట్టు భీమకవి నాచనసోముని నెఱ్ఱప్రగ్గడన్ సన్నుత భారతార్థఘటనాచణుఁ దిక్కన సోమయాజి వి ద్వస్నుత దివ్యభాగవతవాక్పటు బమ్మెరపోతధీమణిన్ సన్నుతిఁ జేసి యాధునిక సత్కవిరాజిఁ బ్రశంపచేసెదన్, 14 15 16 17