షష్ఠాశ్వాసము దర్పమున సర్పపతిఁ దఱిత్రాడుఁ జేసి మథన మొనరింప దానవామవర రేణ్య కరకృతాచార్యపర్యాయకర్షణమున నాభుజంగేంద్రుఁ డధిగతాయాసుఁ డైన. క. ఆలోనఁ దన్ముఖంబుల నాలోల ప్రాణవదనహరిదీశ మహీ కోలాహలజనకం బై హాలాహల ముప్పతిల్లె నద్భుతరీతిన్. 259 150 151 8. అమరు లెల్లఁ గూడి యమృతంబు సాధింప నధిక మైనయత్న మాచరింప విసము పుట్టె మొదట విశ్వైకభయద మై దైవకృత్య మేల తప్ప నేర్చు? 152 క. పుట్టినయాక్షణమున ఫణిఁ బట్టినదై తేయ దివిజభటులు భయముచే నిట్టటు వోవక నిలిచిరి A. మిట్టిపడి దావాగ్నిఁ గూలుమిడుతలరీతిన్. మఱియు నక్కాలకూటంబు విరివి నొంది యంతకంతకు ధర యెల్ల నాక్రమించే విలయసమయమునందు సుద్వేల మగుచు మించి జల లోకముల్ ముంచుకరణి సీ. సంభవద్విపుల సంరంభకుంభ జురీతి నాపోశనముఁ గోను నంబునిధులు జంభారికరతీవ్రదంభోళిసమలీలఁ బగులఁ దాఁకుసు మహాపర్వతములు వటువిక్రమ కమోద్భటమహీపతిరీతి సఖిలదిక్కోణంబు లాక్రమించుఁ 153 154
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/291
స్వరూపం