Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

28 బ్రాహ్మణుల సంభాషణము, దేవతాస్తోత్రము సంస్కృతముతో నేనిర్వహించుట యుచితమనుట కవియభీప్సితము కానోవు. శ్రీకృష్ణ చరిత్రమునందు పోతన భాగవతచ్చాయలును, దక్షాధ్వరధ్వం సఘట్టమునందు నన్నిచోడుని కుమారసంభవచ్చాయలును, కుమార సంభవమునఁ కాళిదాసు కుమార సంభవచ్చాయలును గోచరించును. స్వకపోలకల్వితము అయిన మనోజ్ఞవర్ణనము లిందుఁ బెక్కు గలవు. వాని నెల్లవివరించుట కిందవకాశము చాలదు. సంస్కృతపదభూయిష్ట మయిన శైలినితఁ డెంత సౌలభ్యముతో నిర్వహించునో అచ్చ తెలుఁగు శైలిని కూడ నితఁడంతే సౌలభ్యముతో నిర్వహించును. మొత్తము మీఁద నీకావ్యమునందలి కలిత్వము మిక్కిలి మనోజ్ఞమై సహృదయరంజకమై యలరారును. . గ్రంథముద్రణము ఈ మూర్తిత్రయోపాఖ్యానమునకు మాతృక యైనతాళ పత్రప్రతిని ఉప్పాం గల నివాసులును, కృతిప్రణీతయగు దంతులూరి బావరాజు వంశ్యులుసునగు శ్రీ దంతులూరి సుబ్బరాజు గారి యొద్దనుండఁగా శ్రీశ్రీ శృంగారకవి సర్వా రాయఁడుగారు దానిని దెప్పించి, లేఖక ప్రమాదములు సవరించి, పరిష్కరించి తొలుతగా కాకినాడనుండి యానాఁడు వెలువడుచుండిన 'మనోరంజని' యను మాసవత్రికలో ధారావాహికముగాఁ బ్రకటింపఁ జేసిరి. 'మనోరంజని' పత్రికాధి పతులు చదువరులకు రుచింపదేమో యని యెంచి కాఁబోలు తొలుత దీనియందలి కృత్యాది భాగమును మాని, కథారంభమునుండి యారంభించి తక్కిన కావ్యభాగ మును వరుసగాఁ బ్రకటించిరి. అది తుద ముట్టినపిదప నందే కృత్యాది భాగమును కూడ ముద్రించి యాకోఱఁతను బూరించిరి. విదవ కాకినాడలోని జి. వెంకన్న బ్రదర్సు వారు క్రీ.శ. 1915లో దీనిని 'మనోరంజని' నుండి యుద్ధరించి గ్రంథ రూపమున ముద్రించి ప్రకటించిరి. అందలి ముఖపత్ర మిట్లు కలదు.