Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

. 240 క. మూర్తిత్రయోపాఖ్యానము వచ్చినతనయం గనుఁగొని మచ్చికతోఁ గౌఁగలించి మహిధరపతి యు దౄచ్చటులరుద్రకోపచ లచ్చిత్తభయంబు వోవ లాలనఁ జేసెన్. పార్వతి తపశ్చర్య సుగంధి. క. అంత నమ్మృగాయతాక్షి యర్ధచంద్రమౌళికిన్ గాంత గామి నాత్మరూప గౌరవంబు కానన ప్రాంతసాంద్రచంద్రికానిభంబుగాఁ దలంచి లోఁ జింత నొందుచుం దపంబు సేయ నూహ చేసినన్. దిగ్గనఁ జిత్తములోవల భగ్గునఁ బొడసూపినట్టేభయశోకభరం బగ్గలముగ మేనక మృదు వాగ్గరిమఁ గుమారిఁ జుంచి పచియించేఁ దగన్. చ. నెలఁత! శిరీష పేశలము నీతను వెక్కడ? కాన లేదా ? య త్యల ఘుతరప్రయానపద మౌతప మెక్కడ? కూడ దమ్మ! ని ర్మలసరసీనరోరుహ సమాగతము తమరాళ బాలకున్ వలనగునే మహాువణవారిధి తుంగ తరంగఖేలనల్. ఈమృదుచరణంబు లె ట్లోరు శీతకంట కాకీర్ణకుతలవిన్యాసములకు నీశిరోరుహభార మె ట్లోర్చు నతిశీత నలిలగంగానదీస్నానములకు, వీరసజ్ఞలత యె ట్లోర్చుఁ గటురసా పూరితఫలదళాహారమునకు 49 50 51 52