ఈ పుటను అచ్చుదిద్దలేదు
షష్ఠాశ్వాసము 231 సీ గీ. క. బాలచంద్రకిరీటాంకపాళిఁ గన్న బాల వసియించెఁ దద్గర్భగోళసీమ, తలఁచు నొక్కొకవేళఁ త్రైలోక్యవర్గ హే తువు లైనకమలజాదుల సృజింప భావించు నొకవేళఁ బ్రబలదానవకోటిఁ జడిపి ప్రపంచరక్షణము నేయ నూహించు నౌకవేళ నుగ్రవేషంబున సకలప్రపంచంబు సంహరింపఁ జింతించు నొక వేళ సేవకాశ్రితులకుఁ దుది లేనియైశ్వర్యపద మొనంగ సర్గరక్షణ విలయనిసర్గ సేవ కావనైకప్రవీణ యై యాదశ శక్తి యంశ మగుచంద్రధరురాణి యాత్మగర్భ సీమ విహరింప భూధరస్వామికాంత. అంతఁ గొంత సమయ మరుగ నుచ్చస్థాన గతము లగుచు గ్రహము లతులభాగ్య మహిమఁ దెలుపుచుండ మహిధరవరురాణి కుద్భవించె నప్పయోజగంధి. జనిరహిత శీనమనోరం జని కంజనిభాస్య యిటులు శైలవనితకున్ జనియించినయవ్వేళన్ జనియించెను హర్షభరము జగముల కెల్లన్. పార్వతి బాల్యము A. బాలచంద్రరేఖపోలిక నభినవాం కురితకల్పలతికకరణిఁ జైత్ర 6 7 8