Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

24 ఇట్లు షష్టాశ్వాసపరిమిత మయిన యీరసపత్తర ప్రబంధమునందు బ్రహ్మవిష్ణు మహేశ్వరులను త్రిమూర్తుల యుపతారలీలాది వర్ణనము సకల విషయ సంపన్న ముగా, సంగ్రహమనోజ్ఞముగాఁ గావింపఁబడి, యణువులో బ్రహ్మాండమును జూపీ నట్టి నైపుణ్యముతో వెలారుచున్నది. కవిత్వము L ఇందలి కవిత్వగుణములను బ్రశంసించుచు దీని ప్రథమ ముద్రణ వీరికా కారులను శ్రీశృంగార కవి సర్వారాయఁడుగాకెట్లు వ్రాసిరి. కవిత్వము సంస్క్వత పదభూయిషమయ్యు మృదుమధురము. ధోరణి ధారాళము. రసము చిప్పిలుచుండు. కల్పనములనల్పములు స్థాలిత్యములు గానరావు. వేయేం? సకల గుణాలంకార సంకలిత మునఁదనవారు' శ్రీమదన గోపాల కృష్ణాప్రసాదలబ్ధకవిత్వ చాతుర్యు డయిన యితనికిఁ గథ నతివేగముగా నడపుటయందుఁ గలచాతుర్యము, శ్రద్ధ మిక్కిలి ప్రశంసనీయము. ఏవద్యము నయినను నితఁడవలీలగా నిర్వహించును. సందర్భానుసారముగా విశేషవృత్తములను బ్రయోగించుటయం దితనికి మక్కు వెక్కువ. అతఁడాయా సందర్భములయందు రచించిన విశేషవృత్తముల వివరము లీక్రింది పట్టికయందుఁ బ్రదర్శింపఁబడినవి. 1. పంచచామరము: 1-86, 2-51, 2-131, 2-165, 3.138, 3.169, 4.18, 4-63, 4-145, 4.157, 4-237, 6–184, 6-165, 6-168 (14 పద్యములు) 2. మత్తకోకిల: 2-28, 8-46, 3-107, 4-10, 4-88, 5-58, 5-151, 6-100 (8 పద్యములు)