206 A. మూర్తిత్రయోపాఖ్యానము ఏమహాత్ముని కరుణ దేవేంద్రముఖుల పదములు రమాస్పదంబు రై పరఁగుచుండు బ్రమథసంయుతుఁ డైసమభవుఁడు తగఁడే వచ్చి కూర్చుండ నీదు: ప్రాగ్వంశ సీమ ? 3. దాక్షాయణి యిటు వల్కఁగ §. సీ. సీ. దాక్షిణ్య మొకింత లేక తామసయుతుఁ డా దక్షుఁడు ముహూరరుణీభవ డక్షుఁడు నై పలికె నమ్మ గాక్షీ మణితోన్. సతీ! పతిగుణగణములు మతి యఁగ నిచటఁ దగదు నోజెకొలఁదిగా సతనికి నెవ్వరు కూర్చొన హితులో తగ వారియెదుట నెన్నుము తన్వి! భసితంబు గజచర్మవననంబు సూచింప నతనివిత్తముకల్మి నడుగ నేల? విషమంబు లై నట్టివీక్షణంబులె తెల్ప నతనిరూపవిలాస మడుగ నేల? జనకు నెచ్చో నైనఁ గన రామి విచరింప నతనికులీనత్వ మడుగ నే? సహచర పై శాచ సంఘంబు లెఱిఁగింప నతనిసద్వర్తనం బడుగ నేల? యహహ! ప్రత్యక్షముగఁ గన్నయట్టివారి కతనిచారిత్ర మెల్ల హస్తామలకము గాని యన్యులు తలపోసి కన వశంబె? యంబుజాక్షి! తదీయయథార్థవృత్తి? గుణహీనుఁ డని శ్రుతుల్ ఘోషించుచుండంగ గుణవంతుఁ డసుమాట కొదువ గాదె?
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/238
స్వరూపం