Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పంచమాశ్వాసము ఘనసార సార చందనము లొసఁగు వృషభవాహనుఁ డయ్యు వినమజ్జనుల కెల్లఁ గురగాందోలికలు ఘణించు గరళధరుఁ డయ్యు నాత్మైకశరణదీన జనుల నందఱ నమృతభోజనులఁ జేయు శంకరునికన్న నమితవాంఛా ప్రదాత యెనదేవుండు భువనంబులందుఁ గలఁడె? కై లాసవర్ణనము ఫాలాక్షుండు సదా సదాపశిమనః పద్మంబులన్ నిల్చియున్ లీలార్థంబు సమస్తదేవగణముల్ నిత్యంబు సేవింపఁగాఁ గై లాసాద్రపయిం ద్రిలోక శుభదాకారంబుతో నుంతుఁడ చ్చైలో త్తంసముభాగ్యలక్ష్మి తరమే చర్చింప నెవ్వారికిన్. ప్రత్యంతాచలకోటిసంభృతహఁద్భాకాంత మై యప్రమే యాత్మొన్నత్యసమేతకూటసముదాయాః కామితాభ్రంబు నై నిత్యంబున్ విలసిల్లునగ్గెరి భవానీనాథులోకైకనం స్తుత్యాకారఘనీభవత్సితయశస్ స్తోనంబుచందంబునన్. 193 14 15 16 A మఱియు నవ్వెండికొండ మార్తాండమండలాతిక్రమణరమణీయతరాగ్ర శిఖరములనుండి ముఖరంబు రై వచ్చునిర్జరంబులశరంబుల నెగడుతుం పురుపరంపరలలోన దడంబడునుడుగణంబులు గలనభోంగణంబు ముక్తా ఫలకీలితకాయమానంబుగ మాధురీధురీణంబు లైనగానంబులు గావించుమహా గుహామందిరకిన్న రీసుందరీబృందంబు మండమందంబుగ మంగళగీతంబులు సలుపుసువాసినీ సముదాయంబుగ మారుత పూరీ తానేక గహ్వరముఖణాయ మానఘుమఘుమధ్వానంబు లసూనంబు లైనదిండిమానివాద్య ఘోషంబులు గాఁగ ననమనముదిత ప్రభా సద్మ వద్మరాగమణి పుంజసంజాతమరీచికావికా సంబు నీరాజనదీపకళికానికా: యంబుగ, సానుగతకాదంబినీ సంబంధబంధు రవిద్యుల్లతాశతంబులు నాట్య ప్రసంగ సంగతసుమనః కురంగనయనానికురుం 13)