Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

21 కనుక, బాహిరములగు నితరాధారములనుబట్టియే కవికాలమునుగాని, గ్రంథరచనా కాలమునుగాని నిర్ణయింప వలసి యున్నది. దీని ప్రథమముద్రణమున కుపోద్ఘాత మును వెలయించిన శ్రీశృంగారకవి సర్వారాయఁడుగా నీతనికాలమును గూర్చి వ్రాయుచు 'కవి యీగ్రంథమునందెందేసి కాల నిర్ణయము సేయకున్నను, గ్రంథ కర్తలని పేర్కొనఁ బడినవారిలో మల్లారెడ్డి ప్రభృతుల కాలమునుబట్టి యిప్పటికి సుమారు నూటపాతికి యేండ్లక్రిందటివాఁడని తేట పడుచున్నది.' అని వానికి. దీని ప్రథమముద్రణము క్రీ.శ. 1915లో జరగి యుండుట చేనిది యిప్పటికి నూట తొంబదియేండ్ల క్రిందట, అనఁగా క్రీ.శ. 1790 ప్రాంతముల రచింపఁబడియుండ వలయును. ఈతని ముని మనుమ లేఁబడి యేండ్లక్రిందట నుండి యుండినందున - ఈకవి నూఱుసంవత్సరముల క్రిందట నుండి యుండునని శ్రీకందుకూరి వీరేశలిం గము పంతులుగారు తమ 'ఆంధ్రకవులచరిత్రము - మూఁడవభాగము' (పుట . 2331 లో వ్రాసియున్నారు. ఆంధ్రకవుల చరిత్ర వర్తమాన శతాబ్ది తొలిదశక ములలో రచింపఁబడుటచే వీరు తెలిపినకాలము కూడ పయిని తెలిపిన కాలమునకే యించుమించుగా సరిపోవుచున్నది. కాని, యీకాల నిర్ణయము సమంజసముగా నున్నట్లుతోఁవదు. ఇతని కాలము నితరాధారములచే నిర్ణయింప వలసి యున్నది. . 1. దీని ప్రథమ ముద్రణమునకు దంతులూరి బాపరాజు వంశజుల యొద్ద నుండి తెప్పించిన తాళ పత్రప్రతితుద ప్రతివిలేఖకుఁ డయిన అల్లమరాజు రంగధా మకవి వ్రాసియున్న పూర్వోదాహృత సీసపద్యమున నాప్రతిని విలిఖించిన కాలము తెలుపఁబడియున్నది. ఆది శాలివాహనశకము 1739 వసంవత్సరము ఈశ్వరనామ సంవత్సరము శరదృతువు ఆశ్వయుజమానము శుక్లకక్షము ఏకాదశి శుక్రవారము. ఈదినమున దంతులూరి పద్మరాజునకు అల్లమరాజ రంగధామకవి యీ కావ్యము యొక్క ప్రతిని తాళపత్రముల యందు విలిఖించి సమర్పించెను. అది క్రీ.శ. 1817 సంవత్సరమునకు సరిపోవుచున్నది. కనుక, నీ మూర్తిత్రయోపాఖ్యానకర్త యతఁ డెవఁడయినను, నిశ్చయముగా నాకాలమునకు ముందువాఁడు కావలయును. ఎంత ముందువాఁడనుట నిర్ణయింప వలసియున్నది. "