Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

20 సపయోగించు కొనుచుఁ గావ్యమునల్లైది సంప్రదాయము కూడఁ గలదు. ప్రబంధ మణిభూషణ మీకోపలోనికిఁ జేరినది. అట్లుకాక పూర్తికావ్యమునే కవితనపేరు చెప్పక మఱకని పేర - ముఖ్యముగాఁ దనకాశ్రయదాత యై తనకు ధనకనక వాహనా౨ కము, లొసఁగి తన్ను సత్కరించినవాని పేర లౌకిక ప్రయోజనఫలము నుద్దేశించి యాతఁడే రచించినట్ల చెప్పినకావ్యము ప్రణీతకృతి యగును. ఇట్టి సందర్భములు మనకు మన సాహిత్యములోఁ చెక్కు కానవచ్చుచున్నను వానికిఁ బ్రణీత కృతులను పేరున్నట్లు తెలియవచ్చుట లేదు. ఇట్టికృతులకుఁ బ్రణీతకృతులని తొలుక పేరు ట పెట్టినవారు శ్రీశృంగారకఎ సర్వారాయఁడుగారే, ఇతర దాక్షిణాత్య భాషలయందిట్టి పద్ధతిగాని, దానికిట్టి ప్రత్యేకమయిన కృతిభేద ప్రతిపత్తిగాని యున్నట్లుకానరాదు. నేఁటి పరిభాషలోఁ జెప్పవలసి వచ్చినచో వ్రణీతకృతియనఁగా Ghost Wri ting అన్నమాట, అద్దే ప్రణీతకవి Ghost Writer అగును. ఒకరికై మరొకరు లౌకిక ప్రయోజనము నాకాంక్షించి కావ్యమునో, రచనమునో చేసి యాతని పేరనే వెలయించుట ప్రాచీనకాలము నుండి కూడ నాచారముగా వచ్చు చున్నట్లు తోఁచును. అట్టిచో నవి వారి రచితములుగానే లోకమునఁ బ్రచారము పొందును. కాని, కొన్ని సందరములయం దాయా కావ్యములను వ్రాసిన యసలు కవులుద్దేశ పూర్వకముగానో, యనుద్దేశ పూర్వకముగానో తమకర్తృత్వమును గుప్తముగానో, వ్యక్తముగానో ప్రకటించుకొనుట కూడఁ గలదు. లేదా కొన్ని ప్రతులలోని గద్యలను దమపేరు మీఁదుగానే రచించు కొని తమ అసలు కర్తృ త్వమును లోకమునకు వెల్లడించుటకై తాపత్రయపడిన సందర్భములు కూడ లేక పోలేదు. మూర్తిత్రయోపాఖ్యాన మిట్టి ప్రణీత కృతియని చెప్పవలసి యున్నది. దీని ప్ర అసలు కర్తయయిన క్రొత్తలంక మృత్యుంజయకవి దీనినేకాక, మఱికొన్ని గ్రంథ ములను మఱికొందఱి పేరరచించి లోకమున వెలయించిన ఒక ప్రణీతకవి - Ghost Wr ter - అని యీ చర్చవలనఁదేలును. కాలము చూ మార్చి దాని నిర్ణయించు (1) II '