పీఠిక మూ_రిత్రయోపాఖ్యానము బ్రహ్మవిష్ణుమహేశ్వరు లను త్రిమూర్తుల మహి -మాదికము నభివర్ణించేడి యొక రసవత్తరః ప్రబంధము. ఇదియే సంస్కృతపురా ణమునకుఁ గాని, కావ్యమునకుఁగాని యనువాదము కాదు, అనుకరణమునుకాదు. ఇది యొక స్వతంత్రప్రబంధము. వివిధ పురాణ గ్రంథములనుండి త్రిమూర్తులకు సంబంధించిన కథలను గ్రహించి, వాని నెల్లనొక సూత్రమునఁ గ్రుచ్చి కవి యీగ్రంథమును రచించినట్లు కాననగును. ఈ ప్రబంధమునకుఁ బురాణత్వగౌరవము కల్పించుటకుఁ గాంబోలు కవియిందలి కథల నెల్ల నైమిశారణ్యమునందు సూతుఁడు శౌనకాదిమహామునులకు వివరించినట్లుగ రచించెను. నైమిశారణ్యమునందు దీర్ఘ సత్రమొండు ప్రవర్తిల్లుచుండెను. అందు సమావిష్ణు లయిన శౌనకాది మహామునులు యజ్ఞదీక్షితుఁడయిన సూతునివలనఁ బుణ్యకరములయిన పూర్వేతిహాసములను ! వినియఁదనియక యతనితో నిట్లనిరి. సి. జగములు సృజియింప సంరక్షణము సేయ విలయ మొందింపనేవిధుఁడొనర్చె వీనికిఁ గర్తలు వేళ్వేఱనున్నారొ యన్ని కార్యములకు నాథ్యుఁడొకఁడొ చనఃభూసలిల సూర్యాచంద్రమఃవవ నాదు లేదేవునియాజ్ఞచేతఁ దమతమమర్యాదఁదప్పక వర్తింతు రేమహాత్మునిమాయ లెఱుఁగలేరు బ్రహ్మశక్రాదివిజు, లేపరమపురుషు మహిమ వర్ణింపఁజాల దామ్నాయగణము నతనిచరితంబుఁ దత్ప్రృధానాంశములును మాకుఁ దెలియంగఁ బల్కుమోమౌనితిలక !
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/2
స్వరూపం