18 మొత్తముమీద నీతఁడు గోదావరీతీర వాస్తవ్యుఁడనుట మాత్రము నిశ్చయము. ఇతఁడు 'విచిత్రచరిత్రుఁ డని ప్రతీతి' యనుచు శ్రీశృంగారకవి సుబ్బారాయఁడు గారు తమయుపోద్ఘాతములో నీతనికి సంబంధించిన వృత్తాంతమును గొంత తెలిపిరి. అనే యిజ్జిది. 'చిన్నతనమున బండ యై చదువు సంధ్యలులేక తల్లిదండ్రులకు దుఃఖ ప్రదుండై యుండ నొకప్పుడు చెప్పినట్లు వినలేదన్న కోపానఁ గఠిన శిక్ష నేసిరి. ఆదం ధనము పడలేక యితఁడు చెప్పకుండ లేచిపోయెను. వారు వెదకి వేసరి నిరాశ చేసి కొనిరి. ఇతఁడుచావునకుఁ డెగించియు నేటంబడఁ బోయివడ లేక యొడ్డును బట్టి కోళ్లనక పోళ్లనక రాళ్లనక మళ్లనక వెళ్లి వెళ్లి పూర్వపుణ్య వశంబున నొక్కచోఁ దపించుచున్న యొక్క సిద్ధమునిని సందర్శించెను. అతఁడు నీవెవరని ప్రశ్నించెను తనవృత్తాంత మాద్యంత మొక్కిత దాఁపక నిక్కము పక్కాణించెను. ఆమాటలు వినఁగానే సిద్ధునికి దయపుట్టి 'నీకు వచ్చిన భయములేదు. నా వద్ద నుండుము. నీకు మేలు చేసెద'నని యధయంబొసంగెను. మంచిదని యంగీకరించి తత్సేవ చేయు చుండఁ గొన్నాళ్లుకడచెను. అంతట సిద్ధునికిఁగాల మాసన్న మయినది. కాలజ్ఞుఁ డాతఁగీతనిఁ బిచ్చి 'నాకు దేవుని సెలవైనది. నేడు నాల్గు గడియల ప్రొద్దువేళ దేహము బాలించెద నన్నింతదనుక గనిపెట్టు కొనియున్న నీకింత యుపకృతి నేన నయింది. కానిమ్ము. నీకొక యుపాయము చెప్పెద. నాయుత మణసమయ నాయుత్ర్కమణసమయ మున నోటినుండి పొంగు శ్లేష్మము సందేహింపక మ్రింగితివా నీవీభూమండలిలో నఖండపండితుండ వగుదువు. నిశ్చయము, నాదేహమిందే సమాధి సేయిుంపు మని చెప్పెను. మృత్యుంజయుం డట్టుకని పెట్టి యుండి గురునానకి చెల్లించి కృతార్థుఁడై బయలుదేవి కొన్నాళ్లకీలు సేవెను. మృతుఁడయినవాఁడు పునరాగతుఁడయినట్లు తల్లి దండ్రు లీతనిం గని యుల్లసిల్లిరి. తనసంచారసమాచార మామూలాగ్రముగా వివరింప విన్నవారండఱు వెఱుఁగుపడి, కవిత్వతత్త్వ మహత్వంబున లోకోత్తరం ఉని బ్రహ్మరథంబు బట్టిరట? — ఈవృత్తాంతమునందు సత్యమెంతయున్నదో తెలియదుకాని క్రొత్తలంక మృత్యుంజయక ఏకవిత్వము మిక్కిలి మహనీయ మనుట మాత్రము సత్య దూరముకాడు.
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/19
స్వరూపం