15 అసలుకవి గ్రంథస్థాధారములనుబట్టి మూర్తిత్రయోపాఖ్యాన మను నీప్రబంధమును దంతులూరి బాపరాజకవి యసునొకక్షత్రియ వంశ్యుఁడు రచించినట్లు తెలియవచ్చు చున్నను నిజమునకిది క్రొత్తలంక మృత్యుంజయకవి యనుకవీశ్వరునిచేత రచింపఁ బడినట్లు దీని ప్రథమ ముద్రణమున కుపోద్ఘాతమును రచించిన శ్రీశృంగారకవి సర్వారాయఁడుగారు తెలుపుచున్నారు. దానికి వారు చూపినయుపపత్తులివి. 1. శృంగారకవి సర్వారాయఁడుగారి పూర్వనివాసము వింజరము క్రోత్త లంక మృత్యుంజయ కవి గ్రామ మగు మురమళ్ల యీవింజరమునకు బహుసమీప మందుఁ గలదు. కృతివ్రణేత యనిపేర్కొనఁబడిన దంతులూరి బావరాజుగారిది వింజరమునకు అరమైలు దూరములోఁగల ఉప్పాంగల. కనుక శృంగారకవి సర్వారాయఁడ' గారి పూర్వులు వీరి పూర్వోత్తర సందర్భములను జక్కఁగా నెఱిఁగి యుండి యావిషయములను వీరికిఁ జెప్పియుండుట. 2. ఈ ప్రబంధముయొక్క ప్రథమముద్రణమునకు మాతృక యైనతాళ పత్రప్రతిని ఉప్పాంగల నివాసులును, దంతులూరి బాపరాజ వంశ్యులును నగు దంతు లూరి సుబ్బరాజు గారి యొద్దనుండి శృంగారకవి సర్వారాయఁడుగారు సంపాదిం చిరి. ఆ తాళపత్ర గ్రంథము తుద తద్గ్రంథ లేఖకుఁడయిన అల్లమరాజు రంగ ధామకవి వ్రాసిన యీక్రింది సీసపద్యము కానవచ్చుచున్నదఁట! శ్రీ లీఐ మదనగోపాలమూర్తిఁ గృతీంద్రుఁ గా దంతులు : బాపమేదినీంద్రుఁ గవిగా నొనర్చి సత్కవిరాజు మృత్యుంజ యాఖ్యుఁడు వీరచించినట్టి దైన మూర్తిత్రయచరిత్రముద మొప్పశాలివా హనశకవర్షంబు లజగుణాద్రి చంద్రసంఖ్య నెసఁగ జరగు నీశ్వరశరత్ సహితాస్తిమానశుద్ధహరిదివస
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/16
స్వరూపం