126 ఉ. A. మూర్తిత్రయోపాఖ్యానము భార్గవనందనుల్ దనకుఁ బ్రౌధిమతో నెఱిఁగించుశాస్త్రముల్ దుర్గమము క్తిసంగలికి దూరము లంచు గ్రహింప మాని జై సర్గికభక్తి యోగమున శాంతి వహించి పురాణయోగిరా డ్వర్గము చిన్నమార్గమున వత్సలుఁ డై విహరించుచుండఁగన్. శత్రుఁ డైనట్టిలక్ష్మీకళత్రునందు మైత్రి వాటించే వీఁడు ప్రమాద మయ్యె ననుచుఁ బుత్రునిఁ బలిపించి యసురవిభుఁడు బుద్ధిఁ జెప్పిన నతఁడు ప్రబుద్ధుఁ డగుచు. క్ష, సహజజ్ఞానము మానక సీ. యహిశయనపదాంబుజద్వయధ్యానకళా మహనీయమాననుం డై యహములు గడువంగ నాతఁ దవికోపమునన్. దట్టించెఁ బలుమాఱు గొట్టించెఁ గళంచే E మట్టించె మత్తసామ:జముచేత వేయించె రాలవైఁ ద్రోయించే గుహంలోఁ జేయించె నభిచారచేష్టితంబు నొప్పించెఁ బిడికిళ్ళ రుప్పించె శిలించేఁ దప్పించె నన్నంబు డయఁ దొఱంగి (మొత్తింది గదలచే హర్తించెఁ జెఱసాల నెత్తించెఁ బెనురాల నెత్తిమీఁడ) సహులఁ గఱపించే వెఱపించె బహువిధము హక్కుఁ గట్టించెఁ దిట్టించెఁ బెక్కు మార్లు చాల వేధించె బాధించె బాలుఁ డైన భాగవత శేఖరుని దైత్యపాలకుండు. 118 119 120 121
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/158
స్వరూపం