క ఉ. §. తృతీయాశ్వాసము అంతట మాన కెల్లహరిదంతములుం బరికించి దైత్యలో కాంతకుఁ గాన లేక దనుజాధిపుఁ దీఘువనంబులన్ మా కాంతుఁడు లేఁడు సత్య మని గర్వము దుర్వహ మై తనర్ప ని శ్చింతమనస్కుఁ డై తను చెందెను రాజ్యమహాసుఖోన్నతుర్. పాతకవర్తనుఁ డగుదను జాతున కీరీతిఁ గొంతసమయం జరుగన్ ఖ్యాతివరుల్ నలువురు తను జాతులు గల్గిరి నమగ్రశౌర్యసమేకల్, వారలలోఁ బ్రహ్లాదుఁ డ వారిత సద్ధర్మనీతివర్తనుఁ డగుచున్ నారాయణపదచింతా పారాయణుఁ డయ్యె బాలభావమునందున్. నవసుధారసముకన్నను విష్ణునామంబు తనరసజ్ఞకుఁ బ్రియతరము గాఁగ మణికిరీటముకన్న మస్తంబునకు విష్ణు చరణనన్నతి విభూషణము గాఁగ గంధర్వగానంబుకన్నఁ గర్ణములకుఁ గంజాక్షుకథ సౌఖ్యకరము గాఁగ సౌధయానముకన్న మాఢపుగృహయాత్ర పదముల కామోదపదము గాఁగ జనక బంధు సహోదరజనులతోడఁ గలసి వర్తించుకన్న భాగవతవరుల మైత్రి సేయుట హృదయసమ్మతము గాఁగ నసురబాలకుఁ డభివృద్ధి నందుచుండె. మఱియు నతఁడు. 125 118 114 115 116 117
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/157
స్వరూపం