Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చ. A. క ద్వితీయాశ్వాసము · అనపుడు రోమహర్షణసుతాగ్రణి యగ్రియవాగ్విలాససం జనితయశోధనుండు ము సాత్యవతేయు గురుం దలంచి య మ్మునులకు నిట్లు పల్కెను బ్రమోదభరంబున మీఱుమీర లే పున వినఁ గోరునిక్కథ యపూర్వము సర్వశుభైక మూలమున్, తార లై నను బహువర్షధార లైన నిద్ధరారేణుగణ మైన నెన్న వచ్చు నాదిపురుషుని మూర్తిత్రయంబునందుఁ గలుగుచెయ్యులు వివరించి తెలుప వశమె? నుతచరితులార! మామక మతిగోచర మైనయంతమాత్రము మీకం జతురత మీఱు వచించెద నతితాత్పర్యమున వినుఁడు హర్షాన్వితు రై. బ్రహ్మచరితము మ పరిపూర్ణుం డఖిలాంతరాత్మ సిగమప్రఖ్యాత చారితు: శ్వరుఁ డానందమయుం దశేషజనతావాజ్మానసామేయని ర్భరసర్వాతీగ నిర్వికారమహిమా పారప్రకాశాతి భూ పురుషగ్రామణి యొక్క వేళఁ బ్రక్కతం బొందున్ని వేచ్చారు. గీ. మాయ యనఁగ నవిద్య నా మజీ ప్రధాన మనఁగ నాహ్వయములు గల వా! ప్రకృతికి నదియ బ్రహ్మాండ మంతయు నావరించి యఖిలజనముల మోహంబు నందఁ జేయ. గీ. ఆట్టిప్రకృతిని గూడి యనాది పురుషుఁ డాదికాలంబునందు గుణాన్వితుఁ డయి సకలత త్వచరాచర సహితభువన వర్గ మొనరింప నాత్మ నత్సాహి యైన.