పుట:మీగడతరకలు.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గృహము





జగము కంటెను స్వీయ గృహంబు ప్రియము
దానికన్న ప్రియతరంబు తన పురంబు,
అంతకంటెను ప్రియతమ మాత్మగృహము;
గృహముకంటెను సౌఖ్యంబు మహిని గలది ?

తల్లి యైనను చేయంగ నొల్లనట్టి
మేలు లెల్లను సమకూర్చఁ జాలు నిల్లు '
అనెడి లోకోక్తి ధారుణి నమరెఁ గానఁ
గృహముకంటెను సౌఖ్యంబు మహిని గలదె?

తనకు గ్రాసంబు లేకున్నఁ మనఁగవచ్చు.
కాని వాసంబు లేకున్న గడపరాదు'
అనెడి లోకోక్తి ధారుణి నమరెఁ గాన,
గృహముకంటెను సౌఖ్యంబు మహిని గలదె?