పుట:మీగడతరకలు.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేటకాఁడు - రాబందు



వేఁటకుక్కలు డేగలు వెంట రాఁగ,
వెడలె కానకు నొకనాఁడు వేఁటకాఁడు;
అంత నతఁ డేగెనో లేదొ కొంతదవ్వు,
దారిలో నొక్క రాబందు తారసిల్లి .

"అయ్య ! మృగయుఁడ ! నీవు వేఁటాడునపుడు
నాదుబిడ్డలలో నీకు నేది యైన
కానిపించిన, చంపక కాతు ననుచు
అభయహస్త మొసంగుమా! " అనుచు వేఁడె.

అంత నాతఁడు పక్షితో ననియె నిట్లు:
"అట్టులే కాని, నీబిడ్డ లనుచు నేను
గుఱుతుపట్టుట యెట్టులో యెఱుఁగఁజాల
కాన చెప్పుమ యేదేని యానవాలు.”

25