- ఆడవాళ్ళుకు కర్మకాండలు
ఆడవాళ్ళలో పెండ్లికానివారు చనిపోయినచో వారి వయసును బట్టి వారి కర్మకాండ జరుగుతుంది. తక్కువ వయస్సు దాదాపు 5-6 సం॥ల బాలికలు చనిపోతే భుజంపై ఎత్తుకొని పోయి ఊరి బయట అంత్యక్రియలకు కేటాయించిన స్థలంలో రెండడుగుల లోతు గోతిని త్రవ్వి పూడుస్తారు. మూడోరోజున కానీ, ఐదోరోజున గానీ జీవించి వున్నప్పుడు ఆ శిశువు తినే పదార్థాలను వంట చేసి సమాధి వద్దకు తీసుకెళ్ళి వాటిని తల్లిదండ్రులు, రక్తసంబంధీకులు అక్కడ ఉంచి ఆరగిస్తారు. ఇంతటితో మరణ కర్మకాండ పూర్తి అయినదని భావిస్తారు. ఆరోజున ఇంటివద్ద భోజనాలు పెట్టే ఆచారముండదు. పెద్దవారికి చేసిన విధముగా '9'వ దినము, '10'వ దినము అని కాని, చిన్నకర్మ, పెద్దకర్మ అని కానీ ఉండవు. ప్రతినెల చెయ్యడం, సంవత్సరానికి చేయడం, ప్రతీ సంవత్సరం చేయడం అను సంప్రదాయము లేదు. ఆధునిక యుగంలో మాత్రం ఆర్థికంగా, సాంఘికంగా అభివృద్ధి చెందినవారు ఆ శిశువు సంస్మరణను, పత్రికా ముఖముగా కానీ, టెలివిజన్ ద్వారా గానీ తెలియజేస్తున్నారు. ఆర్థిక అభివృద్ధి చెందినవారు, వృద్ధాశ్రమంలో గాని, అనాథ ఆశ్రమంలో గానీ పండ్లు పంచుట లేదా భోజనాలు సమకూర్చుట చేస్తున్నారు. ఇది కూడా చాలా అరుదుగా జరుగుతుంది.
- రజస్వల అయిన బాలిక మరణించినచో
ఆ బాలికను పెండ్లి బాలికగా గుర్తించి, జిల్లేడు కొమ్మను శవము ప్రక్కన ఉంచి దానితో వివాహము జరిపించి, పాడెపై తీసుకు వెళతారు. ఇలాంటి వారికి సాధారణముగా కట్టెలతో చితి పేర్చి దహనము చేస్తారు. కొందరు ఇలాంటి వారిని గోయి త్రవ్వి కూడా సమాధి చేస్తారు. పెద్దవారికి చేసేవిధంగా చిన్నకర్మ, పెద్దకర్మ అని చూడకుండా 12 రోజులలో ఏదో ఒక రోజున కర్మను నిర్వహిస్తారు. కుటుంబసభ్యులకు, రక్త సంబంధీకులకు, ఆత్మబంధువులకు సమాచారం ఇవ్వగా వారు ఆ రోజున వస్తారు. మొదట ఇంటి వద్ద పెరుమాళ్ళు ఆరగింపుకై ఆహార పదార్థాలు వండుతారు. ఈ కులస్థులు మద్యమాంసాదులను సేవించేవారు కాబట్టి కోడి మాంసముగానీ, మేక మాంసమును కానీ అన్నం వండి, పప్పులో కూడా పణ్యారాలు (గారెలు) తయారుచేస్తారు. ఇంటిలో అరుగుమీద ఒక స్థలం నిర్ణయించుకొని పెరుమాండ్లను ప్రతిష్టింపచేసి వండిన వంట పదార్థాలన్నీ పెరుమాళ్ళ ముందు విస్తారాకులలో సమకూరుస్తారు. ఒక గ్లాసునిండా తెల్ల కల్లు కూడా ఉంచుతారు. పండ్లు, పూలు సమర్పిస్తారు. తులసీ తీర్థమును తీర్థపు పాత్రలో తయారుచేసి ఉంచుతారు. దీపాలను వెలిగించి, అగరుబత్తీలను అంటించి కుటుంబానికి సన్నిహితంగా గాని, సహకారముగా గానీ ఉన్న వ్యక్తి గోత్రము ఒకేలా 70