Jump to content

పుట:మిత అయ్యల్ వార్లు.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జాతర నిర్వహిస్తారు. వెలమకన్నె గ్రామము, మెదక్ జిల్లాలోని మరియొక ఆలయము శ్రీ రాయగిరి వేంకటేశ్వరస్వాముల వారి దేవాలయము. దాదాపు 150 సం॥ల క్రితం పాపన్నపేట వంశస్థులచే ప్రసిద్ధిగాంచి నేటికీ దేదీప్యమానంగా రోజూ పూజలందుకుంటూనే భక్తకోటికి ఇలవేల్పుగా వెలుగొందుచున్నది. ఇక్కడ ఉగాది సందర్భంగా కళ్యాణము, లంకాదహనము, రథోత్సవము, మరియు ఏడురోజుల పాటు జాతర కూడా నిర్వహిస్తారు. ఇక్కడ ప్రధాన అర్చకులు మలిపెద్ది, మంగళగిరి వంశస్థులు. మరొక దేవాలయము నానక్ నగర్ గ్రామము, రంగారెడ్డి జిల్లాలో ఉంది. ఇది శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయము. ఇది ఆ గ్రామానికి 1 కి.మీ. దూరంలో ఉంది. ఇది సుమారు 150 సం॥ల పూర్వము నిర్మించబడింది. ఇక్కడి ప్రత్యేకత శ్రావణ మాసంలో శ్రీకృష్ణాష్టమి సందర్భంలో రథయాత్ర మరియు ఉట్ల ఉత్సవము జరుగుతుంది. ఇక్కడ మిత అయ్యల్వార్లు అయిన తిరువాయిపేట వంశస్థులు ప్రధాన అర్చకులుగా ఉండి పూజలు నిర్వహిస్తున్నారు. 59