రూపాయలు వస్తున్నాయని వారు తెలిపారు. దీనిని బట్టి దేవదాయ ధర్మాదాయశాఖ గుర్తించిన ఆలయాలుగా కూడా వీటిని చెప్పుకోవచ్చును.
ముఖ్యంగా దసరా, దీపావళి, ఉగాది వంటి ముఖ్యమైన పండుగ రోజుల్లో రథోత్సవాలు కూడా జరుగుతాయి.
మిత అయ్యల్వార్లు అర్చకులుగా ఉన్న మరికొన్ని దేవాలయాలు
ఇక్కడ ఉన్న కొన్ని దేవాలయాలలో మిత అయ్యల్వార్లు ఎన్నో ఏళ్ల నుండి అర్చకులుగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఉన్న అన్ని దేవాలయాలలోని విగ్రహాలు అన్నీ స్వయంభువు కావడం విశేషం. అక్కడ ఉన్న వేరే వైష్ణవులు కాకుండా శుభ, అశుభ కార్యక్రమాల్లో మిత అయ్యల్వార్లు పూజారులుగా ఉండడం కూడా విశేషం. మొదటగా హైదరాబాద్ లోని చెంచలగూడ యందు గల శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం. దాదాపు 100 సం॥ క్రితం చెంచలగూడ గ్రామంలో భూమి తవ్వుచుండగా స్వామి విగ్రహం బయటపడింది. అప్పుడు అక్కడ ఉన్న బస్తీ పెద్దలు సమావేశమై చర్చించుచుండగా, అక్కడ ఉన్న ఒకరికి పూనకం వచ్చి 'నేను చెన్నకేశవస్వామిగా ఉద్భవించాను, నాకు ఒక దేవాలయం నిర్మించి నిత్యపూజలు జరిపించవలసినది' గా తెలిపాడని చెబుతారు. అక్కడ ఉన్న బస్తీ పెద్దవారైన కీ. శే. దువ్వల చెన్న కృష్ణయ్యగారు ముందుకు వచ్చి అందరినీ ప్రోత్సహించి అందమైన చెన్నకేశవస్వామి ఆలయాన్ని నిర్మించారు. మూలవిరాట్టుకు వేద మంత్రాలతో యజ్ఞాలు జరిపించి ప్రతిష్ఠించారు. తరువాత మద్రాసు నుండి ఉత్సవ విగ్రహాలను తెప్పించారు. ఆరాధనకై నిత్య వైష్ణవులైన ముద్దం వంశస్థులు అర్చకులుగా నియమింపబడ్డారు. అప్పటి నుండి ముద్దం వంశస్థులు, ఆ తరువాత తాళ్ళూరి వంశస్థులు అర్చకత్వం స్వీకరించి పూజలు జరుపుతున్నారు.
ఈ దేవాలయములో ప్రతి సంవత్సరము ధనుర్మాసము సంక్రాంతిన 30 రోజుల నిత్య ఆరాధన జరిపించుటయేకాక, శ్రీకృష్ణ జయంతి ఉత్సవములు 9 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ సంప్రదాయము ఆనాటి నుండి ఈనాటి వరకు జరుగు చున్నది. మిత అయ్యల్వార్లు అందరూ కలిసి ఈ చెంచల్గూడ ఆలయంలోనే నిత్య వైష్ణవ సంఘంను 1949లో స్థాపించారు. 1965లో అది రిజిస్టర్డ్ చేయబడినదికూడా.
జగదేవపూర్ గ్రామము, జగదేవ్ పూర్ మండలం, మెదక్ జిల్లాలో ఉన్న రంగనాయక స్వామి దేవాలయము. ఇక్కడి స్వామివారిని సుమారు 120 సం॥ల క్రితం ప్రతిష్ఠించారు. ఇక్కడ ప్రధాన అర్చకులు అనంతుల, తిరునగరి వంశస్థులు. శ్రీరామనవమి రోజున స్వామివారికి కళ్యాణోత్సవము, రథోత్సవము, చక్కెర తీర్థముతో
58