| దయాపాత్రం | దయకు పాత్రలు |
| ధీ | జ్ఞానము |
| భక్తి | భగవంతుని యందు భక్తి, అనురాగము |
| ఆది | మొదలైన |
| గుణ | గుణములను |
| ఆర్జవము | సముద్రము |
| యాంత్రాంద్ర | యతిరాజులయందు |
| ప్రవణం | ప్రీతిగలవాడు |
| రమ్యజామాతరం మునిన్ | మణవాళ మునులను |
| వన్డే | సేవించుచున్నాను |
తాత్పర్యం: శ్రీశైల శౌర్యుల దయకు పాత్రులయిన వారగు జ్ఞానము, భక్తి, మున్నగు, గుణములకు సముద్రము వంటి వారైనవారగు, శ్రీ యతిరాజుల యందు ప్రీతిగల వారునైన మణవాళ మునులను సేవించుచున్నాను.
దేవాలయాలలో మిత అయ్యల్వార్లు నిర్వహించే పూజా విధానం
నా క్షేత్ర పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రాంతంలోని కొన్ని దేవాలయాలను సందర్శించాను. అక్కడ మిత అయ్యల్వార్లు జరుపుతున్న పూజా విధానాన్ని, పూజారులుగా, అర్చకులుగా వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను. అలాగే మిత అయ్యల్వార్లు పూజా కార్యక్రమంలో భాగంగా దేవుడికి సమర్పించే నైవేద్యంలో వీరు ఆచరించే పద్ధతి మిగతా దేవాలయాలలో చేసే పద్ధతికి కొంత తేడా ఉన్నది. అంతేకాకుండా వంశపారంపర్యంగా కొన్ని దేవాలయాలకు కేవలం మిత అయ్యల్వార్లే పూజారులుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అటువంటి దేవాలయాలకు సంబంధించిన విషయాలను కూడా తెలియజేస్తున్నాను.
సాధారణంగా అర్చకులు అనేవాళ్ళు దేవాలయాల్లో, ఇంట్లో ఏ పూజా కార్యక్రమాలు నిర్వహించినా పూలు, పండ్లు, పాలు వంటి తదితర శాకాహార సంబంధమైన వాటితోనే నిష్ఠగా దేవుడికి నైవేద్యంగా సమర్పించడం మనం చూస్తుంటాం, అదే హిందువుల ఆచారం. కానీ మిత అయ్యల్వార్లు అర్చకులుగా ఉన్న దేవాలయాల్లో మద్యం, మాంసం నైవేద్యంగా సమర్పించడం ఒక ఆనవాయితీగా కొనసాగుతోంది. ఆ నైవేద్యాన్నే భక్తులకు ప్రసాదంగా ఇవ్వడం కూడా జరుగుతుంది.21
అలా నేను క్షేత్ర పర్యటనలో సందర్శించిన దేవాలయాలు కరీంనగర్ జిల్లాలోని
55