“సర్వధర్మాన్ పరిత్యజ్య - మామేకం శరణం వ్రజ |
అహంత్వా సర్వపాపేభ్యో - మోక్షయిష్యామి మాశుచ ౹౹"17
స్వాచార్యా తనియలు అనుసంధించుకొనవలెను. తర్వాత ఆచార్య తిరువడిఘళ్ళను శిరస్సు నుండి తీసి పెట్టెలో భద్రపరచి సాష్టాంగపడి భాగవతోత్తముల ఆజ్ఞనేడి శ్రీపాద తీర్థమును రెండు మారులు పుచ్చుకొనవలెను. ఆచార్య సాన్నిధ్యము కలిగినప్పుడు వారి శ్రీ హస్తముతోనే శ్రీపాద తీర్థ పరిగ్రహణము చేయవలెను.
పంచ సంస్కారపరులైన శ్రీవైష్ణవులే గాక శ్రీవైష్ణవ స్త్రీలు కూడా లలాటము మరియు కంఠమందు తిలకము దిద్ది శ్రీపాద తీర్థ గ్రహణము చేసి నిత్యనుష్ఠానములను పూర్తి చేసుకొనవలెను.
శ్రీవైష్ణవ కుటుంబంలో పంచ సంస్కారపరులైన ప్రతి ఒక్కరును తమ తమ నిత్య అనుష్ఠానములను స్వయంగా జరుపుకొనవలయును.
పెరుమాళ్ళ తిరువారాధనము మాత్రం కుటుంబంలోని పెద్దలు ఒక్కరు మాత్రము సమర్పించితే చాలు, తక్కినవారు పెరుమాళ్ళ తీర్థ, ప్రసాదములను స్వీకరించినచో తిరువారాధనము కూడా పూర్తి చేసుకొనినట్లుగా భావించవచ్చును.
ఇంకను శ్రద్ధగలవారు నిత్యకాలక్షేపము, అష్టాదశ రహస్యములు, భగవద్విషయము మున్నగునవి అనుసంధించుకొని, శ్రీకోశములకు ఆరగింపు సమర్పించి, శ్రీకోశములను తిరువణి పెట్టెను, ఏలినవారి పెట్టెను యథాస్థానమందుంచవలెను.
- "జీయర్ తిరువడిఘళె శరణం౹౹
- నిత్యనుష్ఠాన విధి సమాప్తము” “18
13. మణవాళే మహాముని
క్రీ.శ.1370-1444 (125 సం౹౹లు జీవించారు). 1370 సాధారణ నామ సం౹౹ తులామాస (ఐప్పిశి ఆశ్వయుజ) శుక్రవారం మూలా నక్షత్రమున కురుకాపురి యందు జన్మించారు. వీరు తిహాళక్కిండందాన్ తిరువావుడయభిరాన్ తాథారణ్ణయ్యర్, శ్రీరంగ నాచ్చియార్ పరమ భాగవతుల ఇంట కుమారుడుగా అవతరించారు.
వీరికి... 1. పెరియజియ్యరు 2. సౌమ్యజామాతృ యోగీంద్రుడు 3. యతీంద్ర ప్రవణుడు 4.అళహియమణవాళ జియ్యరు 5. కాంతోపయంతృగురుడు 6. వరవరముని 7. రామానుజ పొన్నడి 8. రమ్యజామాత19 అను నామాలు కలవు.
వైష్ణవ సంప్రదాయాన్ని విస్తరించడమే కాకుండా, సంస్కృతమయమైన గ్రంథాలను ప్రాంతీయ భాషలోనికి సులభతరంగా అనువదించారు. మొదట మాతామహుల వద్ద వేదాధ్యయనము చేసి, శ్రీశైలేశార్యుయను ఆచార్యుల వద్ద ద్రావిడ వేదాంతాన్ని అధ్యయనం
53