Jump to content

పుట:మిత అయ్యల్ వార్లు.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తప్పక ధరించవలెను. అష్టోత్తర దివ్య తిరుపతులు భావనతో 108 పూసలుగల తులసీమాలను, డెబ్బదినాల్గు సింహాసనస్థ ఆచార్య పురుష భావన చేసి 74 తామరపూసల మాలను పవిత్రమాలలను కంఠమునందు ధరించి తిరునాపయందు తీర్థముంచి దానియందు స్వాచార్య శ్రీపాద తీర్థమును (ఏలినవారి తీర్థము) మధ్యవ్రేలితో ముమ్మారు అస్మత్ గురుభ్యోనమః అని చేర్చి, ఏలిన వారికి (ఎల్లమారుకు) తిరువడిఘళ్ళకు చక్కెరయో, ఫలమో ఆరగింపుగా సమర్పించి కేశవాది ద్వాదశ నామములను అనుసంధించుచు, ద్వాదశ స్థానములయందు తిరువడిఘళ్ళను ఉంచుకొనుచు శిరస్సున ధరించి అంజలబద్ధుడై నేత్రములు మూసుకొని ఏకాగ్రత సమకూర్చుకొని ఆచార్య ధ్యానము చేయవలయును. “అస్మద్గురుభ్యోనమః" అను పదమూడు వాక్యములు, తిరుమంత్రము, ద్వయము ఆచార్యోపదిష్టమైన తనియలు అనుసంధించుకొనవలయును.

వాక్య గురు పరంపర

అస్మద్గురుభ్యో నమః
అస్మత్ పరమగురుభ్యో నమః
అస్మత్ సర్వగురుభ్యో నమః
శ్రీమత్ రామానుజాయ నమః
శ్రీ పరాయశ దాసాయ నమః
శ్రీమత్ యామున మునయే నమః
శ్రీరామ మిశ్రాయ నమః
శ్రీపుండరీకాక్షాయ నమః
శ్రీమన్నధ మునయేనమః
శ్రీమత్ శఠగోపాయ నమః
శ్రీమత్ విష్వకేసేనాయ నమః
శ్రీయై నమః
శ్రీధరాయ నమః

మూల (తిరు) మంత్రము

ఓం నమో నారాయణాయ

ద్వయము

శ్రీమన్నారాయణ చరణా శరణం ప్రపద్యే
శ్రీమత్ నారాయణాయ నమః

చరమ శ్లోకము

52