Jump to content

పుట:మిత అయ్యల్ వార్లు.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
యతీంద్ర ప్రవణం వన్దే రమ్య జామాతరం మునిమ్ 16

తిరుమణి ధరించుట

కేశవాది ద్వాదశ నామములచే ద్వాదశ (పన్నెండు) స్థానముల యందు తిరుమణి ధరించవలయును.

1. ఓం కేశవాయ నమః లలాటము నందు
2. ఓం నారాయణాయ నమః నాభియందు
3. ఓం మాధవాయ నమః వక్ష స్థలమునందు
4. ఓం గోవిందాయ నమః కంఠము నందు
5. ఓం విష్ణవే నమః కుడి ఉదరము నందు
6. ఓం మధుసూధనాయ నమః కుడి భుజమునందు
7. ఓం త్రివిక్రమాయ నమః కుడి మెడయందు
8. ఓం వామనాయ నమః ఎడమ ఉదరమునందు
9. ఓం శ్రీధరాయ నమః ఎడమ భుజమునందు
10. ఓం హృషికేశాయ నమః ఎడమ మెడయందు
11. ఓం పద్మనాభాయ నమః వీపు అడుగు భాగమందు
12. ఓం. దామోదరాయ నమః వెనుక మెడయందును

ధరించగా మిగిలిన తిరుమణిని శిరస్సున చల్లుకొని తర్వాత శ్రీ చూర్ణమును కలుపుకొని ఈ విధంగా ధరించాలి.

శ్రీ చూర్ణము ధరించుట

ఓం శ్రీదేవ్యైయ నమః లలాటమునందు
ఓం అమృతోద్భనాయై నమః నాభియందు
ఓం కమలాయై నమః వక్షమునందు
ఓం చంద్రశోబిన్యై నమః కంఠము నందు
ఓం విష్ణుబాంధవ్యై నమః కుడి ఉదరమునందు
ఓం వైష్ణవై నమః కుడి భుజంనందు
ఓం హరివల్లభయై నమః ఎడమ ఉదరమునందు
ఓం శార్జిణ్యైనమః ఎడమ భుజమునందు
ఓం శ్రీదేవ దేవ్యై నమః ఎడమ మెడయందు
ఓం శ్రీ మహాలక్ష్యై నమః వీపునందు
ఓం లోక సుందర్యై నమః వెనుక మెడయందు

ధరించి మిగిలిన శ్రీ చూర్ణమును శిరస్సున పోసుకొంటూ లలాటము మరియు మెడలో

51