Jump to content

పుట:మిత అయ్యల్ వార్లు.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వస్త్రములు ధరించవలెను. “శ్రీమత్ నారాయణాయ నమః అని స్థలం శుద్ధి చేసి తాను దర్భాసనము గాని, తాటాకుల చాప గాని కూచోడానికి వేసుకొని, ముందు ఎత్తైన పీఠము నందు తిరుమణి పెట్టెను ఉంచుకొని అనుష్ఠానమునకు తీర్థము చెంబు, స్థాళి, ఉద్ధరణి సిద్ధముగా ఉంచుకొనవలయును. మొదట స్థాళిలోని తీర్థమును ఉద్ధరణితో ఉద్దగింజ మునుగునంత తీర్థమును హస్తమునందు ఉంచుకొని మూడు పర్యాయములు పుచ్చుకొనవలెను. తరువాత... 1. ఓం అచ్యుతాయనమః, 2. ఓం అనంతాయనమః, 3. ఓం గోవిందాయనమః అంటూ తర్వాత ఈ క్రింది నామములు చెప్పుచూ ఆయా అవయవములను ఆయా వ్రేళ్లతో సృశింపవలయును. 1. ఓం కేశవాయ నమః 2. ఓం నారాయణాయ నమః 3. ఓం మాధవాయ నమః 4. ఓం గోవిందాయ నమః 5. ఓం విష్ణవే నమః 6. ఓం మధుసూధనాయ నమః 7. ఓం త్రివిక్రమాయ నమః 8. ఓం వామనాయ నమః 9. ఓం శ్రీధరాయ నమః 10. ఓం హృషికేశాయ నమః 11. ఓం పద్మనాభాయ నమః 12. ఓం. దామోదరాయ నమః కుడి పెద్ద వ్రేలుతో కుడి ఎడమ దవడలను సృశింపవలెను ఉంగరపు వ్రేలుతో కుడి ఎడమ నేత్రాలు చూపుడు వ్రేలితో కుడి ఎడమ నాసిక చిటికెన వ్రేలితో కుడి ఎడమ కర్ణములను ఐదువ్రేళ్ళ అంచులతో భుజములను నాలుగు వ్రేళ్ళతో నాభిని సృశించవలెను. ఐదు వ్రేళ్ళలో హృదయాన్ని, శిరస్సును సృశించవలెను. ఇట్లు సృశించి సర్వావయవములు పవిత్రములైనట్లుగా భావించుకోవాలి. తర్వాత తిరుమణిక్కాపు చేసుకోవటానికి తీర్థపుచెంబు నుంచి కొంచెము తీర్థము తిరునాడిలో (గోకర్ణము) ఉంచుకొని తూర్పుముఖంగా స్థిరంగా కూర్చుని మూడుసార్లు చేతులు తట్టి తిరుమణి పెట్టె విప్పవలెను. తిరుమణి కాపును హస్తమందుంచుకొని... శ్రీ భూదేవ్యై నమః అని అభిమంత్రించి గోకర్ణములోని తీర్థమును అరచేతిలో ఉంచుకొని తిరుమణి కలుపుచు శ్లోక గురుపరంపరతో ప్రారంభించి, పెరుమాళ్ళు, పిరాట్ట మొదలుకొని ఆచార్య పర్యంతము నిత్య తనియలను అనుసంధానించుకొనుచు తిరుమణిక్కాపు ధరించవలయును. అనతిచ్చియ తనియను చదువుకోవాలి శ్రీశైలేశ దయాపాత్రమ్ ధీభక్త్యాది గుణార్ణవమ్ 50