Jump to content

పుట:మిత అయ్యల్ వార్లు.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విద్యార్హత లేకుండా కేవలం అక్షరాస్యులు వీరిలో 27.71% మంది ప్రాథమిక లేదా జూనియర్ బేసిక్ వరకు చదువుకున్నారు మరియు 0.57% మంది మాత్రమే మెట్రిక్యులేషన్ లేదా హయ్యర్ సెకండరీ వరకు చదువుకున్నారు.12

11. ఆర్థిక పరిస్థితులు

మిత అయ్యల్వార్ల యొక్క సాంప్రదాయ వృత్తి మాలలు మరియు మాదిగల ఉత్సవ సందర్భాలలో వారి కార్యక్రమాలు నిర్వహించడం మరియు వీరికి ఆధ్యాత్మిక సలహాదారులుగా వ్యవహరించడం. కొంతమంది స్థానికంగా భిక్షాటన చేస్తూ జీవిస్తున్నారు. వీరు రామాయణం మరియు మహాభారత కథలను వీధి నాటకాలుగా కూడా ప్రదర్శిస్తారు. అన్ని కులాల వారు పుణ్యక్షేత్రాలకు హాజరవుతారు. ఈ వ్యక్తులు సాంప్రదాయ వృత్తుల నుండి తగినంతగా సంపాదించ లేకపోవడంతో, వీరు వివిధ రకాలైన ఇతర వృత్తులను చేపట్టటం జరుగుతోంది.

తద్వారా సమాజంలో వృత్తిపరమైన అవకాశాలను పొందుతున్నారు. ఆధ్యాత్మిక సలహాదారులుగా విధులు నిర్వహిస్తున్న మాల, మాదిగ వంటి కులాలతోపాటు వ్యవసాయం, ఇతర వ్యవసాయ వృత్తులు చేపడితే ఇబ్బందిగా ఉంటుందని కొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళి ఇతర వృత్తులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అటువంటి వారిలో కొందరు ఉపాధ్యాయులుగా, గుమస్తాలుగా, ప్యూన్లు మొదలైన ఉద్యోగాలను చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని కొందరు ఇప్పుడు చాప నేయడం, విస్తరాకులు, బీడీలు చుట్టటం లాంటి గృహవృత్తులను కూడా తమ వృత్తిగా చేస్తున్నారు.

1961 జనాభా లెక్కల ప్రకారం, మిత అయ్యల్వార్ జనాభాలో 43.59% మంది కార్మికులు. ఇందులో 36.02% పురుషులు మరియు 51.90% స్త్రీలుగా ఉన్నారు. వ్యవసాయ కార్మికులు 0.90% మంది మైనింగ్, క్వారీ మొదలైన వాటిలో పనిచేస్తున్నారు. 3.79% కార్మికులు గృహ పరిశ్రమలో ఉన్నారు, నిర్మాణంలో 0.72% మరియు ఇతర సేవలలో 12.37%గా ఉన్నారు.

క్షేత్ర పర్యటనలో నేను పరిశీలించగా వీరిలో కొంతమంది పురుషులు కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు. ఇంకొంతమంది మహిళలు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మగవారు రోజువారీ పనులు చేసుకుంటున్నారు. వీరిలో కొంతమంది వ్యక్తులు హరికథలు, పాటలు మరియు పద్యాల రూపంలో ఎక్కువగా పౌరాణిక కథలు చెబుతూ మరియు పూజారులుగా పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. కొంతమంది వ్యక్తులు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఇంకొందరు వ్యక్తులు అర్చకత్వంపై పూర్తిగా ఆధారపడి ఉన్నారు. అలాగే కొంతమంది రాజకీయ పార్టీలలో కార్యకర్తలుగాను, మున్సిపల్ ప్యూన్లుగాను, రైతులుగాను, నైట్ స్కూల్ టీచర్లుగాను మరియు పంచాయతీ కమిటీ మెంబర్లుగాను, తాపీ

47