పలకలపై మాత్రమే తినాలని నియమం వీరికి ఉంది. వీరు మొక్కల వేర్లు ఆహారంగా తీసుకోరు. వీరు కోడి మాంసం, గొర్రెలు, మేకలు మరియు తాబేళ్ల మాంసాన్ని తినేవారు. అన్నిరకాల చేపలను తినేవారు. వీరు గొడ్డు మాంసం, పంది మాంసం, చిలుక మాంసం లాంటి వాటిని తినేవారు కాదు. అలాగే వీరు చనిపోయిన జంతువుల మాంసాన్ని తినరు. వీరు చంపాలనుకుంటున్న జంతువు నోటిలో కొంత నీరు (పవిత్రమైన పదాలు చదివిన తర్వాత) చిలకరిస్తారు, తరువాత దానిని చంపి ఆ మాంసాన్ని తింటారు. అంతేకాక సేకరించిన మాంసాన్ని వీరు తినరు. పండుగ రోజుల్లో ప్రత్యేక ఆహార పదార్థాలు తీసుకుంటారు. ఉగాది, సంక్రాంతి, దసరా మరియు దీపావళి లాంటి పండుగల రోజున గొర్రెలు, మేక లేదా కోడి మాంసం మరియు ఇతర శాకాహార ఆహారాన్ని తీసుకుంటారు. ఏకాదశినాడు ఉపవాసం పాటిస్తారు. కొందరు ఉపవాసం పాటించక పోయినా ఆ రోజు మాంసాహారం తీసుకోరు. గోకులాష్టమి రోజున ఉపవాసం ఉంటారు. మరుసటి రోజు వారు తమ భోజనంతో పాటు కోడి మాంసం తింటారు. అంతేకాక మద్యం కూడా తీసుకుంటారు. శ్రీరామనవమి రోజు వారు శాకాహార భోజనం మాత్రమే తీసుకుంటారు మరియు మాలలు మరియు మాదిగలకు పానకం (బెల్లం నీరు) వడ్డిస్తారు. వంట చేయడానికి మరియు ఆహారాన్ని నిల్వ చేయడానికి వారు మట్టి కుండలను మాత్రమే ఉపయోగిస్తారు. లోహ పాత్రలను ఉపయోగించడం నిషిద్ధం కాదు, కానీ వారి ఆర్థిక స్థితి వలన ఎలాంటి లోహపు వస్తువులను వాడే అవకాశం ఉండదు. ఆహారం తీసుకునే ముందు ఒక క్షణం ప్రార్థన చేయడం పెద్దలలో ఆచారం. కొంచెం నీరు తీసుకున్న తర్వాత మాత్రమే ఆహారం తీసుకుంటారు.10
9. దుస్తులు మరియు ఆభరణాలు
సాధారణంగా ఈ జాతి మగవారు ధోవతీ మరియు నిండు చొక్కా ధరిస్తారు. తలపాగా కూడా ఉపయోగిస్తారు. వారు తమ దుస్తులకు ముతక వస్త్రాన్ని ఉపయోగిస్తారు. ఆడవారు స్థానిక పద్ధతిలో చీర మరియు జాకెట్టు ధరిస్తారు. ఈ కులానికి ప్రత్యేకంగా నిర్దేశించిన ఆభరణాలు అంటూ ఏమీ లేవు. స్త్రీలు చేతులకి ధరించే వాటికి ఇత్తడి కంకణాలు మరియు వెండి ఆభరణాలను ఉపయోగిస్తారు. ఒక వితంతువు ఇత్తడి గాజులు మరియు వివాహ తాళి ధరించడం వీరికి నిషేధించబడింది. ఆమె వెండి గాజులు మాత్రమే ధరిస్తుంది. శరీరంపై పచ్చబొట్టు పొడిపించుకోవడం ఈ సమాజంలోని మగవారిలో లేదా ఆడవారిలో లేదు. మిత అయ్యల్వార్లు చాలా తరచుగా వాషింగ్ మరియు టాయిలెట్ సబ్బులు వాడతారు. వారిలో కొందరు స్నానం చేసేటప్పుడు శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి జొన్న పిండిని ఉపయోగిస్తారు.
45