Jump to content

పుట:మిత అయ్యల్ వార్లు.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

7. మిత అయ్యల్వార్ల నివాసం

సాధారణంగా వీరి నివాసాలు మాల మరియు మాదిగ కుటుంబాలతోపాటు ఉండేవి. సాధారణంగా వీరి ఇంటిని 'పూరిల్లు' అని పిలుస్తారు. ఇది తాటి ఆకులతో కప్పబడి ఉంటుంది. ఇది దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. ఈ ఇళ్ళు నేల మట్టం పైన ఉన్న ప్లాట్ ఫారమ్ లపై నిర్మించబడి ఉంటాయి. గోడలు మట్టి మరియు రాళ్లతో నిర్మించుకుంటారు. సాధారణంగా వీరి ఇంట్లో రెండు గదులు ఉంటాయి లేదా రెండు గదులుగా నిర్మించుకుంటారు. అందులో ఒకటి వంట చేసుకోవడానికి, వస్తువులు నిల్వ చేయడానికి, పూజ చేసుకోవడానికి మరియు మరొకటి నిద్రించడానికి మరియు కూర్చోవడానికి వీలుగా వాడుకుంటారు. రెండు గదులను కలుపుతూ ఒక తలుపును ఏర్పాటు చేసుకుంటారు. ముందు గదికి ప్రవేశ ద్వారం పెట్టుకుంటారు. ఇళ్లకు వెంటిలేటర్లు, కిటికీలు ఉండవు. ఇంటిని నిర్మించాలనుకునే ఇంటి పెద్ద ఇంటి నిర్మాణం కోసం ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. వీరి సంప్రదాయం ప్రకారం తొమ్మిది కౌరీలు (పాచికలు) మూడుసార్లు ఆడతారు మరియు పైకి వచ్చే మొత్తం కౌరీల సంఖ్య లెక్కించబడుతుంది. దీనికోసం వీరు చింతామణి అనే పుస్తకాన్ని పరిశీలించి అందులోని నంబర్ కు సూచిస్తారు మరియు వ్యాఖ్యానాలకు అనుగుణంగా పరిగణిస్తారు. అవి అనుకూలంగా ఉంటే, ఆ స్థలం మంచి దని పరిగణిస్తారు లేకపోతే వారు మరొక ప్రదేశానికి వెళతారు. ఇంటి నిర్మాణం ప్రారంభంలో, వారు ఇంటి మధ్య భాగంలో ఒక స్తంభాన్ని ప్రతిష్టించి, కొబ్బరికాయను పగలగొట్టి, వంశ దేవునికి పూజలు చేస్తారు. ఈ సందర్భంగా హాజరైన వారి బంధుమిత్రులకు, బంధువులకు కొబ్బరి ముక్కలను పంచుతారు. ఇంటి నిర్మాణంలో కుటుంబ సభ్యులు సహకరిస్తారు. అవసరమైతే కులసంఘాల వారు కూడా సహాయం చేస్తారు. ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత, వారు గృహప్రవేశ వేడుక ను జరుపుకుంటారు. కొత్త ఇంట్లో ముందుగా పాలు పొంగించుకుంటారు. ఈ రోజున వారు ఒక మేక లేదా గొర్రెను బలి ఇచ్చి కుల ప్రజలందరికీ విందు చేస్తారు. వారు ప్రతిరోజూ పొయ్యిని కడుగుతారు మరియు తరువాత ఆహారం వండుతారు. నేలపై ఆవు పేడతో అలుకుతారు. ఈ కులానికి ప్రత్యేక బావి ఉంటుంది. కాని ఈ బావి నుండి ఇతరులు నీటిని తీసుకోడానికి అనుమతి ఉండదు.

8. ఆహారపు అలవాట్లు

ఈ ప్రజల ప్రధాన ఆహారం బియ్యం, మొక్కజొన్న, జొన్నలు, రాగులు, సజ్జలు మరియు గోధుమలు. వృద్ధులు రెండుసార్లు మాత్రమే ఆహారం తీసుకుంటే యువకులు మూడుసార్లు తీసుకుంటారు. ముందురోజు రాత్రి మిగిలిపోయిన ఆహారాన్ని పగటిపూట పిల్లలకు అందిస్తారు. పెద్దలు తమ మొదటి భోజనం మధ్యాహ్నానికి, రెండవ భోజనం రాత్రికి తీసుకుంటారు. ఆకు

44