5. జీవన విధానం
మిత అయ్యల్వార్లు సమాజంలో సరిగా ఎవరికి తెలియని కులం. ఈ కులం పేరు చెప్పగానే అదొక కులం కూడా ఉందా? అనే ప్రశ్న ఎన్నోసార్లు ఉదయించింది. ఈ కులం ఎక్కువగా మాలవారికి పరిచయ కులం. ఎందుకంటే, ఇది మాల ఆశ్రిత కులం. కానీ పులికొండ సుబ్బాచారి గారు “జానపద విజ్ఞానం, ఆశ్రిత సాహిత్యం” అనే తన పరిశోధనా గ్రంథంలో ఆశ్రితు లందరూ నిమ్నవర్గానికి చెందినవారు కారు, అందులో కొందరు పూజనీయ స్థితిలో కూడా ఉన్నారని చెప్పారు 7ఆ విధంగా మాలవాండ్లను గురువులుగా ఈ మిత అయ్యల్ వార్లని చెప్పుకుంటారు. వీరు మాలవాండ్లకు కర్మకాండలు చేయడం వృత్తిగా స్వీకరిస్తారు. అంటే చనిపోయినప్పుడు జరిగే కార్యక్రమాన్ని అంతా వీరే గురువులుగా ఉండి జరిపిస్తారు. ఎన్ని రోజులకు దినవారాలు పెట్టాలి? సంవత్సరీకం ఎప్పుడు పెట్టాలి? ఇటువంటి ఈ కార్యక్రమాలను అంతా ఈ మిత అయ్యల్వార్లే చూసుకుంటారు.
6. స్త్రీల జీవన విధానం
వీరి ఆచార సంప్రదాయాల ప్రకారం స్త్రీ గర్భందాల్చిన రెండవ నెలలో కుటుంబంలోని ఇతర మహిళా సభ్యుల ద్వారా తెలియచేస్తారు. వీరిలో గర్భధారణకు సంబంధించిన వేడుకలు ఉండవు. మొదటి జననం సాధారణంగా తల్లిదండ్రుల వద్ద మరియు తరువాత భర్త ఇంటివద్ద జరుగుతుంది. మంచాలు లేదా కొన్ని చిరిగిన బట్టలతో ఒక తెరలాంటి దానిని ఏర్పాటు చేయడం ద్వారా ఇంటిలోని కొంత భాగాన్ని ప్రసవం కోసం వేరు చేస్తారు. ప్రసవ మైల 20 రోజులుగా ఉంటుంది. బిడ్డ పుట్టిన రోజు నుండి ప్రతిరోజూ స్నానం చేస్తారు. కానీ తల్లి ప్రసవించిన మూడవ రోజు నుండి రోజు తప్పించి రోజు స్నానం చేస్తుంది. ఇదే కులానికి చెందిన వృద్ధురాలు లేదా మాల కులానికి చెందిన మహిళ ప్రసవానికి హాజరవుతారు. ఆమెను స్థానికంగా మంత్రసాని అని పిలుస్తారు. ఆమెకు స్థానికంగా కణం అనే రవికె ముక్కను బహుకరించి రూ. 2 వేతనంగా ఇచ్చేవారు. ప్రసవానికి అయ్యే ఖర్చు దాదాపు రూ.20 అయ్యేది. 21వ రోజున తల్లికి అంతిమ స్నానం చేయబడుతుంది మరియు ఆ రోజు నుండి తల్లి తన సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తుంది. జనన పూర్వ కాలంలో ఆహారం గురించి ఎటువంటి నిషేధాలు లేవు కానీ జనన పూర్వకాలంలో ప్రత్యేకమైన ఆహార పదార్థాలు, బెల్లమన్నం (బెల్లం కలిపిన అన్నం) మరియు పప్పు అన్నం (పప్పు కలిపిన అన్నం) తినిపిస్తారు. ప్రసవానంతర కాలంలో మిరేం అన్నం (మిరియాలతో కలిపిన బియ్యం) మాత్రమే ఇవ్వబడుతుంది.8 '
43