భావించి, అతన్ని గౌరవిస్తారు. మాలకులం వారందరూ ఆ బిడను పవిత్రంగా భావించి తన సలహాలను పాటించేవారు. తరువాత, ఈ వ్యక్తి యొక్క వారసులు మాల అయ్యల్వార్లు మరియు చివరికి మిత అయ్యల్వార్ అని పిలవబడ్డారు.3
3. మిత అయ్యల్వార్ల జనాభా
మునుపటి జనాభా లెక్కల్లో ఈ కుల జనాభా గణాంకాలు అందుబాటులో లేవు. అయితే, 1921 జనాభా లెక్కల ప్రకారం మిత అయ్యల్వార్ల గురించి ఆ లెక్కలలో ప్రస్తావించబడిందని తెలుస్తోంది. నాటి జనాభా లెక్కల ప్రకారం వీరి సంఖ్య 3,869గా తెలుస్తోంది4. అయితే 1921 జనాభా లెక్కల ప్రకారం మిత అయ్యల్వార్ లేదా మిత అయ్యవార్ ఒకరేనా అనేది సందేహమే. 1961 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఈ కులానికి చెందినవారు 2,542 మందిగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని షెడ్యూల్డ్ కులాల మొత్తం జనాభాలో మిత అయ్యల్వార్ల జనాభా 0.05%. కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా మిత అయ్యల్వార్లు ఉన్నారు. ఆ తర్వాత నిజామాబాద్, ఆదిలాబాద్ మరియు వరంగల్ జిల్లాలు ఉన్నారు. మిగతా జిల్లాల్లో వీరి గురించి పెద్దగా సమాచారం లేదు. కరీంనగర్ జిల్లాలోనే మిత అయ్యల్వార్ల మొత్తం జనాభా 37.21%గా ఉన్నారు. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాలో 15.03%, ఆదిలాబాద్ జిల్లాలో 14.48%, వరంగల్ జిల్లాలో 13.57% మరియు మెదక్ జిల్లాలో 10.78%గా ఉన్నారని ఈ జనాభా లెక్కల ప్రకారం తెలుస్తోంది. మహబూబ్ నగర్, ఖమ్మం, హైదరాబాద్ మరియు నల్గొండ జిల్లాల్లో వీరు చాలా తక్కువ సంఖ్యలో కనిపిస్తారు. మిత అయ్యల్వార్ జనాభాలో 52.32% మంది పురుషులు మరియు 47.68% స్త్రీలుగా గుర్తించారు. 97.29% గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 2. 71% మాత్రమే పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారని తెలుస్తోంది. లింగ నిష్పత్తి ప్రతి 1,000 మంది పురుషులకు 911 మంది స్త్రీలు ఉన్నారు.5
4. మిత అయ్యల్వార్ల కుటుంబం మరియు వంశం
నా క్షేత్ర అధ్యయనంలో వీరి గురించి తెలుసుకొన్న దాని ప్రకారం మిత అయ్యల్వార్ల కుటుంబాలు సాధారణంగా ఉమ్మడి కుటుంబాలుగా జీవిస్తారు. నివాస నియమం పాక్షికంగా స్థానికంగా ఉంటుంది మరియు వారసత్వ పాలన తండ్రి నుండి కొడుకుకు వస్తుంది. మిత అయ్యల్వార్లలో ఉపకులాలు లేవు. నేను నా క్షేత్ర పర్యటనలో భాగంగా మిత అయ్యల్వార్ కులంలోని ఈ క్రింద చెప్పిన ఇంటిపేర్లను సేకరించాను. అవి...
1) పరాంకుశం 2) తిరుకోవెల 3) సాత్పడి 4) గట్టు 5) తిరునగరి 6) లవంగాల.6
మిత అయ్యల్వార్లు అందరూ వైష్ణవులు సాధారణంగా వీరు ఇంటిపేరును మరియు వేరే గోత్రం వారైతే చూసి వివాహం చేసుకోవటం ఆచారంగా ఉంది.
42