1. సంస్కృతి నిర్వచనం
ఒక సమాజంలో తరతరాలుగా ఒకేవిధమైన పద్ధతిని కొనసాగించడం ఆ సమాజ సంస్కృతిగా నిర్వచించవచ్చును. ఒక సమాజంవారి సంగీతం, కళ, జీవన విధానం, ఆహారం, శిల్పం, చిత్రం నాటకం ఇవన్నీ ఆ సమాజపు సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. ఒక సమాజంలో ఉన్న వస్తు వినియోగం, జానపద వ్యవహారాలు కూడా సంస్కృతిగానే పరిగణింప బడతాయి. 1874లో “సామాజిక పురాశాస్త్రము” గురించి రాస్తూ టైలర్ అనే శాస్త్రవేత్త సంస్కృతిని ఇలా వర్ణించారు 'సంస్కృతి' లేదా 'నాగరికత'ను విస్తారమైన జాతిపరమైన అంశంగా భావిస్తే ఆ జాతి లేదా సమాజపు సంక్లిష్టమైన జ్ఞానం, విశ్వాసాలు, కళలు, నైతికత, చట్టం, ఆచారాలు సమాజంలో భాగస్తుడైనందున, ఆ వ్యక్తికి సంక్రమించిన అలవాట్లు, నైపుణ్యత, అవకాశం అన్నింటినీ కలిపి సంస్కృతి అనవచ్చును” అని తెలిపారు.
ఐక్యరాజ్యసమితి విద్యా విజ్ఞాన సాంస్కృతిక సంస్థ (యునెస్కో) వారు సంస్కృతిని ఇలా వర్ణించారు.
"ఒక సమాజానికి లేదా సమూహానికి చెందిన ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, లౌకిక, వైజ్ఞాన, భావోద్వేగ అంశాలు ఆ సమాజపు సంస్కృతి అవుతాయి. కళలు, జీవన విధానం, సహ జీవనం, విలువలు, సంప్రదాయాలు విశ్వాసాలు కూడా ఈ సంస్కృతిలోని భాగాలే”.
ఇలా సంస్కృతిని చాలా విధాలుగా నిర్వచించారు వైజ్ఞానికులు. 1952లో అల్ఫ్రెడ్ క్రోబర్ మరియు క్లేడ్ క్లుఖోనె అనే రచయితలు తమ సంకలనంలో సంస్కృతికి 161 నిర్వచనాలను సేకరించారు.
ఈ విధంగా అనేక నిర్వచనాలు ఉన్నప్పటికీ ఏ జాతి సంస్కృతిని మాత్రం ఆ జాతి ప్రజలే చెప్పాలి. కొన్నిసార్లు సంస్కృతిని పక్కదారి పట్టించే అవకాశం కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఈ మిత అయ్యల్వార్ల సంస్కృతి ఆచార వ్యవహారాల గురించి తెలియచేయడం కూడా సంస్కృతిలో ఒక భాగమే కూడా సంస్కృతిలో ఒక భాగమే. కాబట్టి ముందుగా వారి ఆచార వ్యవహారాలు తరువాత వాళ్ళ సంస్కృతిని గూర్చి చెప్పాలనుకుంటున్నాను.
40